''దేవుడు విషాదాన్ని సృష్టించి, కంటి తుడుపుగా 'ఓదార్పు' ను సృష్టించాడు.
* కాఫీ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయిట ...కాఫీ తగ్గించకూడదా?''
''గుండెపోటు కాఫీ తాగడం వల్ల రాదు. కొడుకు ప్రేమగా చూసుకోకపోతే వస్తుంది. కోడలు బిడ్డలా ఆలోచించలేకపోతే వస్తుంది''
*ఇద్దరు కసాయివాళ్ళు ఈ మేక నాకు కావాలంటే నాక్కావాలని గొడవ పడుతుంటే ఆ మేకపిల్ల ఎలా విలవిల్లాడిపోతుందో, ఆ తల్లి కూడా అలానే విలవిలలాడిపోయింది.
*ఓ దేవుడా నీకు శత సహస్ర కోటి కృతజ్ఞతలు. కృతఘ్నులైన కొడుకులనిచ్చి, కొండంత దేవుడైన భర్తను తీసుకెళ్లి, నా బాధను చూడలేక, నాకు అండగా ఓ తండ్రిని ఇచ్చినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ప్రభూ.
*మళ్ళీ జన్మంటూ వుంటే గొడ్రాలుగా పుట్టించు దేవుడా! అని దేవుడ్ని మనస్ఫూర్తిగా వేడుకుంది.
*అక్కడున్న సమాధులను కదిలిస్తే ఎన్ని కథలు వెతలుగా చెబుతాయో, అక్కడ తగలబడుతున్న చితులను అడిగితే ఎన్ని కన్నీళ్ళను అక్షరాలుగా అనువదిస్తాయో...?
**అదో స్మశానం ..దాన్ని అనుకుని శరణాలయం..స్మశానమే వారికి దేవాలయం...
చితికి నిప్పంటించి చేతులు దులుపుకుని అయినవాళ్లు వెళ్ళిపోతే,ఏమీకాని అతను ఆ చితిలో దేహం బూడిదగా మారేవరకు అక్కడే ఉంటాడు బసవప్ప...
అద్భుతం.అద్భుతం.అద్భుతం
కళ్లనుంచి కన్నీళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి.గుండె చెమ్మగిల్లింది
