మనసును పట్టికుదిపేసే అద్భుతమైన నవల.నిరుద్యోగ యువత ఆవేదనకు అక్షరరూపం.దొంగ స్వామీజీల వికృతరూపాన్ని కళ్ళకు కట్టిన నవల.ఆముక్తమాల్యద పాత్ర ది బెస్ట్.అమాయకత్వం,ఉక్రోషం,భావుకత్వం,కలగలిసిన పాత్ర.బామ్మ పాత్ర కొత్తదనానికి నాంది.కథానాయకుడి పోరాటం,స్నేహితుడు ఉరికొయ్యకు వేలాడే సందర్భంలో వచ్చిన సన్నివేశాలు ఉత్కంఠకు ప్రాణం పోస్తాయి.
"చూడు మిత్రమా...నా మరణాన్ని చూడు,,,కొద్దీ క్షణాల్లో ఉరికొయ్యకు బిగుసుకుపోయి ప్రాణం కోల్పోయి చట్టబద్ధంగా హత్యచేయబడ్డ నా మృతదేహాన్ని చూడు..."అన్న స్నేహితుడి చివరిమాటలు ఒళ్ళు గగుర్పొడిచేలా వున్నాయి.
*నువ్వు నన్ను ప్రేమించినా...ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను..ఇది ఫిక్స్...చెప్పాడు సాకేత్ ఆముక్తమాల్యదతో.
*"ఉద్యోగం వస్తే రోజుకో కొబ్బరికాయ కొడతానని నువ్వు మొక్కుకుంటున్నావు...నీకు ఉద్యోగం ఎప్పుడొస్తుందా అని ఎదురుగా వున్న కొబ్బరికొట్టు వాడు ఎదురుచూస్తున్నాడు..అయినా శరీరాన్ని ఇలా ప్యాక్ చేస్తే నీకు ఉద్యోగం ఎవరిస్తారే .."దెబ్బయేళ్ళ బామ్మ మనవరాలు ఆముక్తమాల్యదతో అనడం సూపర్బ్.
ఆలోచిస్తూ ఆహ్లాదాన్ని అందించిన మరణశాసనం ఒక సినిమా చూస్తున్నట్టు వుంది.ప్రతీపాత్ర ప్రాణం పోసుకుంది.
