కథలు చదువుతుంటే భావోద్వేగాలు ప్రాణం పోసుకుంటున్నాయి.రొమాన్స్ కు సెక్స్ కు వున్న తేడాను అద్భుతంగా చెప్పినతీరు గ్రేట్.
ఇలాంటి పార్టనర్ ఉంటే బావుందని రొమాన్స్ కు సెక్స్ కు మధ్య వున్న సన్నటి సరిహద్దును అద్భుతంగా చెప్పారు.భార్యాభర్తలు బెడ్ రూమ్ లో ప్లజంట్ గా చదువుకునే కథలు.ఎక్కడా అసభ్యత లేకుండా భావుకత్వంతో రోమాంచితమైన భావోద్వేగాలను కథల్లో సృజించిన తీరు మహాద్భుతం.ఇలాంటి పార్టనర్ ఉంటే బావుందని అమ్మాయిలు/ అబ్బాయిలు అనుకునేవిధంగా పాత్రలకు ప్రాణం పోశారు.
రచయిత చెప్పిన ఈ మాటలు చదువరుల హృదయాల్లో పరిమళాలు వెదజల్లుతాయి.
"ఉదయమంతా అలసట ...వృత్తిపరమైన వ్యక్తిగతమైన సమస్యలు...వాటిని పడగ్గది బయటే వదిలేయండి.
స్పా లకు వెళ్లినా,విహారయాత్రలకు వెళ్లినా ఎంత ఖర్చుచేసినా లభించని గొప్ప అనుభవం..అనుభూతి మీ ఇద్దరి కలయికలోనే వుంది.
కౌగిలిని మించిన గొప్ప సెక్యూర్డ్ ఫీలింగ్ మరోటి ఉంటుందా?
వ్యాయామంతో ఖర్చుచేసే క్యాలరీలు రొమాన్స్ తో ఖర్చు చేయండి.అనుభవాలను రొమాంటిటిక్ మెమోరీస్ గా డిఫాజిట్ చేసుకోండి.అనుభూతి ఫ్రీజర్ లో మీ కలయికలు భద్రపర్చుకోండి.
ఈ ధాత్రిలో ప్రతీ రాత్రి మీదే ..ప్రతీ పగలు ప్రతీ క్షణం..ఒకరి సమక్షంలో మరొకరు సేద తీరండి..కలయిక శయ్యపై విశ్రమించండి.
ప్రతీ రాత్రి శోభనరాత్రి కావాలి ...
ఎప్పటికప్పుడు కొత్తగా,కొంగ్రొత్తగా మీ రొమాంటిక్ మెనూ ను మార్చుకోండి.కొత్త ఇష్టాలు సరికొత్త ఊహలు..ఆలోచనలు..కబుర్లు...మీ ఏకాంతంలో నేపథ్యసంగీతం కావాలి.
"క్యాండిల్ లైట్ శోభనం" అద్భుతం అద్భుతం అద్భుతం
