మేన్ రోబో ఒక విభిన్నమైన నవల.షర్మిల పాత్రలో రెండు షేడ్స్ బావున్నాయి.మేన్ రోబో షర్మిల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు హార్ట్ టచ్ గా వున్నాయి.సులోచన పాత్ర అత్యద్భుతం .ఆమె మాటలు మనసును గిల్లుతాయి.ప్రశ్నిస్తాయి.సెడక్ట్రస్ పాత్ర ఒళ్ళు గగుర్పొడిచేలా వుంది.
సెప్టెంబర్ 11 దాడి ని తన స్టైల్ లో కొత్తగా కాల్పనిక పాత్రలత్ మలిచిన విధానం బావుంది.
తిరుపతి దివ్యక్షేత్రంలో అగ్నిహోత్ర అడ్వెంచర్ హాలీవుడ్ స్థాయిలో వుంది.
ఒక మంచి నవల చదువుతూ థ్రిల్లర్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించారు రచయిత.
