ఒకే పుస్తకంలో నాలుగు నవలలు అందించడం మంచి ప్రయోగం.ఒకేసారి నాలుగు రచనలు చదివే అవకాశం వుంది.అందులోనూ నాలుగు విభిన్నమైన కథాంశాలు.అండర్ వరల్డ్ నవల చదువుతుంటే ఒక మాఫియా థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది.
"నిన్ను వారం రోజుల పాటు వంటావార్పు ప్రోగ్రాం చూసుకునే డ్యూటీ వేస్తున్నాను" అన్నాడు క్యూ టీవీ ఛానెల్ చైర్మన్
"ఏ బహుత్ అన్యాయ్" అన్న విభ్రమ డైలాగ్ శ్రీదేవిని జ్ఞప్తికి తెప్పించింది.
టార్గెట్ నవల చదువుతుంటే డ్రగ్స్ కు బానిసైన యువతే కాదు డ్రగ్స్ ను అలవాటు చేసి తీవ్రవాదులు అమాయకులను ఎలా బలి చేతున్నారో అర్థమవుతుంది.పాతికేళ్ల క్రితం రాసిన నవలలోని అంశాలు ఇప్పుడూ కొట్టగానే వున్నాయి.
పైసా వసూల్ సబ్జెక్టు విభిన్నం.కుబేరుడి దగ్గర అప్పుచేసి హీరో,అప్పుకు వడ్డీ చెల్లించనందుకు కారులో వెళ్తున్న వైభవ్ ను అలా గాల్లోకి తీసుకువెళ్లి కిడ్నాప్ చేయడం,నవ్విస్తూ ఆలోచింపజేసే ఆహ్లాదకరమైన నవల.
మీఇష్టం ప్రతీఒక్కరూ చదువవలిసిన వ్యక్తిత్వ వికాసం.ముఖ్యంగా దేవుడికి రచయితకు మధ్య జరిగిన సంభాషణ హైలెట్
రెంట్ ఆప్షన్ కూడా పెట్టి బావుండేది.
