"జైలు గోడలమధ్య హీరో సుమన్" పుస్తకం చదువుతుంటే ఒక థ్రిల్లర్ సినిమా చూసినట్టు వుంది.కొన్నిచోట్ల కన్నీళ్లు ఆగలేదు.ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.సుమన్ జీవితంలో ఎదుర్కున్న కష్టాలు విషాదాల ముందు వారి ఆత్మహత్యలకు కారణం ఎంతచిన్నవో అర్థం కావాలి.
గుండెనిబ్బరంతో లైం లైట్ లో వున్నా హీరో పాఠాలలో పడినా తిరిగి పైకివచ్చి విజయశిఖరాలు అధిరోహించిన తీరు అభినందనీయం.ఒక వ్యాసంలా కాకుండా ఒక కథలా సజీవచిత్రంలా అద్భుతమైన కథనంతో సుమన్ అనుభవించిన విషాదాల నేపథ్యాన్ని అద్భుతంగా రాసిన రచయిత విజయార్కె గారికి హేట్సాఫ్ .ఇది ఒక వ్యక్తిత్వవికాస పుస్తకంలా జీవితాన్ని జయించిపోరాడే పుస్తకంగా చదివి స్ఫూర్తి పొందాలి.
ఈ ప్రపంచంలో నాకే కష్టాలు వున్నాయి,అని ఒత్తిడిలో నిస్పృహలో వున్నవాళ్లు ఈ పుస్తకాన్ని ఒక్కసారి చదివితే వారి ఆలోచనాసరళి మారవచ్చు.
ఇలాంటి మంచి పుస్తకాలు అందిస్తున్న కినిగెకు ధన్యవాదాలు.
