బాధలన్నీ మరిచిపోయి మనఃస్ఫూర్తిగా నవ్వించిన కథలు.కథల్లోని పాత్రలు,పలికించిన హాస్యం అందించిన ఆహ్లాదం వెలకట్టలేనిది.విభిన్నమైన కథలతో మళ్లీమళ్లీ చదవాలని అనిపించినా కథలు.లాక్ డౌన్ లో ఒత్తిడిని తగ్గించి కొత్తప్రపంచానికి తీసుకువెళ్లిన " నవ్వు దేవుడొచ్చాడోచ్ "ఈ పుస్తకం రూపంలో వచ్చాడు.
నవ్వు కనబడుటలేదు,అనే కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో ఇస్తే అనే ఆలోచన చదవడానికి ఆసక్తికరంగా వుంది.
మనకు ఎందరో దేవుళ్లున్నారు,కానీ నవ్వుదేవుడు లేడు,విజయార్కె గారు సృష్టించిన నవ్వు దేవుడికి స్వాగతం చెబుతూ నవ్వుదేవుడు మన ఇళ్లలోనే ఉండేలా చేసుకుందాం.
ప్రతీకథ హాస్యంలో రంగరించిన మిఠాయి.ఇంతమంచి పుస్తకాన్ని అందించిన కినిగెకు ధన్యవాదాలు.విజయార్కె గారి రచనాశైలి అద్భుతం .వీటిని ఎవరైనా వెబ్ సిరీస్ గా తీస్తే పాఠకులకు ప్రేక్షకులకు నవ్వుల పండుగే.
