వ్యవస్థలోని చీకటికోణాలను వెలికితీసిన నవల,నకిలీ స్వామీజీల నిజరూపం తెలియజేసిన నవల.విద్యావ్యవస్థ తీరును ఆవేదనగా ప్రశ్నించిన నవల. మానవతా విలువలను కళ్లకుకట్టిన నవల.ఆముక్తమాల్యద,సాకేత్ ,బామ్మా,సత్యవర్ధన్ శివరాం,కృష్ణస్వామి,ఇవి పాత్రలు కాదు కళ్ళముందు కనిపించే వ్యక్తుల ప్రతిరూపాలు.
మనసును హత్తుకున్న నవల.ప్రేమకు కొత్త అర్థాన్ని చెప్పిన నవల,మార్కెట్లో బంగారానికి,షేర్స్ కు వున్న వున్న విలువ ఇరవయ్యేళ్ళ కృషితో అకుంఠిత దీక్షతో మేధస్సుతో సంపాదించిన డిగ్రీలకు లేదా? అని సూటిగా నిలదీసిన నవల,
ఆధ్యంతం ఆసక్తికరం,ఉత్కంఠభరితం., ఒక చలనచిత్రంగా కళ్ళముందు నిలిపిన మరణశాసనం భావోద్వేగాల మిళితం.
