మాయాశిల్పం మంత్రఖడ్గం చదివి ఆ ఫీలింగ్ లో నుంచి బయటకు రాలేకపోయాను.నేను మణిమేఘన దగ్గరే ఆగిపోయాను.అద్భుతమైన వర్ణన కళ్ళముందు గంధర్వలోకాన్ని నిలియింది.వర్చువల్ ప్రపంచంలోకి రచయిత మమ్మల్ని తీసుకువెళ్లాడు.నిజంగా మేఘాలు రాకుమారిని చూసి తప్పుకున్నట్టే వుంది.
*”మా గంధర్వ యువరాణీవారు ఉద్యానవనంలో వుంది. .వెనక్కి వెళ్ళండి" అని భటులు చెప్పగానే మేఘాలు పక్కకు తప్పుకున్నాయి. చంద్రుడూ తప్పుకున్నాడు కొలనునీటిలో తన ప్రతిబింబం కనిపించకుండా..
అద్భుతమైన రచనాశైలికి వందనం.ఇలాంటి జానపద నవలలు మరెన్నో మీరు మాకు అందించాలి.
