మేన్ రోబో నవల ఏకబిగిన మరోసారి చదివాను.శరీరం గగుర్పొడిచింది.ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు అనిపించింది.పాత్రల్లో ప్రాణం తొణికిసలాడింది.అగ్నిహోత్ర పాత్ర చూస్తుంటే దేశంకోసం ప్రాణాలు అర్పించిన ఆర్మ్ జవానులు గుర్తొస్తున్నారు.మేన్ రోబో సాహసాలు కళ్లకు కట్టినట్టు వున్నాయి.ఈవిల్ సిటీ నిజంగా ఉందేమో అన్న భ్రమ.సెడక్ట్రస్ పాత్ర మరచిపోలేము.మేన్ రోబో ఎమోషన్స్ యాక్షన్ సన్నివేశాలు సినిమా దృశ్యాలను తలపించాయి.రచయిత శ్రమను గుర్తుచేశాయి. ఆంత్రాక్స్ కథాంశం ఇప్పటి కరోనా కు అన్వయించుకుంటే అద్భుతమైన అడ్వెంచర్ నవలగా అనిపిస్తుంది.షర్మిల ప్రేమ, సులోచన పాత్రలోని డ్రామా నవలలోని ఏ చిన్న అంశాన్ని రచయిత నిర్లక్ష్యం చేయలేదు.ఇలాంటి నవలలు సినిమాలుగా రావలిసిన అవసరం వుంది.
