ఇక్కడ నుండి చాలా పుస్త్తకాలు కొన్నాను గాని, చదవగానే దీని గురించి రాయాలి అనిపించిన పుస్తకం ఇది.
కొనుక్కుని దాచుకోవలసిన / కొని బహుమతిగా ఇవ్వవలసిన పుస్తకం ఇది. శీర్షికకు తగ్గట్టుగానే, ఎక్కడ జన్మించినా తెలుగు దేశంలో ఖ్యాతి పొంది, తెలుగువారి గుండెల్లో స్థానం సంపాదించిన గొప్పవారు / మాణిక్యాల వివరాలు ఇందులో ఉన్నాయి.
అయితే సినిమా రంగం నుండి ఎంతోమంది గురించి చెప్పిన ఈ పుస్తకంలో " సూర్యకాంతం " గారి గురించి ఉండకపోవడం నిజంగా లోటే..మిగతా వారి పేర్లు మళ్లి మళ్ళి పెట్టుకున్నారు, వారి మీద అభిమానంతో.... కాని ఆమె పేరు మాత్రం ఆమెదే, ఆ పేరుకు అలా ఒక అద్వితీయత / ఎకైకత తీసుకొచ్చారు ఆవిడ.
