పుస్తకరచయిత చెప్పిన ఈ మాటలు అక్షరాల నిజాలు.గుడ్ నైట్ స్టోరీస్ దంపతుల జీవితాన్ని స్వీట్ నిఘ్త్స్ గా మారుస్తుంది.
" చీకటి ముసుగేసాక ధాత్రిని రాత్రి చుట్టుముట్టాక మీ ప్రపంచంలో మీరూ ,మీ జీవితభాగస్వామి....పడగ్గది .మీ వ్యక్తిగత సామ్రాజ్యం.
ఆ సామ్రాజ్యంలో రాజు రాణి సైన్యమూ సర్వమూ సమస్తమూ మీరే.
ఫీలింగ్స్ ఎమోషన్స్ అనుభవాలు అనుభూతులు కలబోసిన కలర్ ఫుల్ రెయిన్ బో ...
ఆ ఇంధ్రధనుసులో ...
ప్రేమ ఇష్టం కోరిక స్పర్శ మాట అనుభవం అనుభూతి ..సప్తవర్ణాల ఇంధ్రధనుసులో చేరిన మరో వర్ణం రొమాంటిక్ ఫ్లేవర్ మీకు శుభరాత్రి చెబుతుంది.
పడగ్గది కేవలం మీరు నిద్రించే స్థలం మాత్రమే కాదు.
ఈ సృష్టిలో...
ప్రకృతి,
స్త్రీ,
పెదవులపై స్వచ్ఛంగా మెరిసే నిష్కల్మషమైన చురునవ్వు.
ఈ మూడింటినీ నిరంతరం ప్రేమిస్తాను.ప్రేమిస్తూనే వుంటాను.
అయితే ప్రకృతి ప్రళయాన్ని సృష్టించి బీభత్సంగా మారినా.
స్త్రీ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయినా
చిరునవ్వులో కల్మషం కనిపించినా ..
అందమైన కల కరిగిపోతుంది.
ప్రకృతిని,అందంగా స్వచ్ఛమైన చిరునవ్వును తన పెదవులపై నిలుపుకునే పరిపూర్ణ వ్యక్తిత్వం వున్న స్త్రీని మించిన గొప్ప సౌందర్యం బ్రహ్మదేవుడు కూడా సృష్టించలేదన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్.
అలాంటి స్త్రీ ...నా కథలకు స్ఫూర్తి.
నా కథల్లోని నాయికలు దివినుంచి అక్షరపు కాన్వాసుపై నిలిచిన అందమైన చిత్రాలు.
గుడ్ నైట్ స్టోరీస్ దంపతుల పడగ్గదిలో రొమాంటిక్ ఫ్లేవర్ ల,సన్నజాజి పరిమాళాల్లా,నిలిచిపోవాలి.
ఈ కథల్లోని కథానాయికలు మీరే..
ఈ కథల్లోని కథానాయకులూ మీరే..."
