అద్భుతం ...మన ఆలోచనలను ప్రశ్నించే పుస్తకం
గెలుపు అంటే అర్థం ఏమిటి? ఓటమికి నిర్వచనం ఏమిటి?
యుద్ధంలో ఒక దేశం గెలవడం గెలుపే.. కానీ ఒక దేశాన్ని ఆక్రమించుకుంటే ఆ గెలుపు నిజమైన గెలుపా?
ఒక కిరాయిహంతకుడు సుపారీ తీసుకుని హత్యచేస్తే అది గెలుపా?
గెలుపు అంటే మనకు ఆనందాన్ని లేదా డబ్బును ఇచ్చేది కాదు.. ఎదుటివారిలో కూడా ఆనందాన్ని కలిగించేదే గెలుపు
రామోజీరావుగారి పేరు తెలియని తెలుగు వాళ్ళే కాదు భారతీయులు కూడా వుండరు. ఆ మాటకొస్తే ప్రపంచమంతా గర్వించే రామోజీ ఫిలిం సిటీ, వార్త సంస్థలు, వేలాదిమందికి ఉపాధి ఇది కదా గెలుపు. రామోజీరావు అన్న పేరు ఈరోజు ఒక గెలుపు చిహ్నం.
వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడిచేసిన ఉగ్రవాదులది గెలుపే.. కానీ కొన్ని వేలమంది ప్రాణాలు తీసిన ఆ దుశ్చర్య, ఉన్మాదం గెలుపు కాదు... ఓటమితో సమానం.
* గెలుపు అంటే ఓటమి నుంచి నేర్చుకునే పాఠాలు .. ఎమోషన్స్‌ను బ్యాలన్స్ చేయడం.. ప్రాక్టికల్‌గా ఆలోచించడం....
ఒక గెలుపు మనకు మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది
మరొకటి.. మన గెలుపు మన చుట్టూ ఉన్నవాళ్లకు ఆనందాన్ని ఇస్తుంది.
