చతురలో విజేత నవల జులై 1997 లో చదివాను.
ఒక అందమైన మనసున్న, బావను తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే అమ్మాయి... "బావా.. నిన్ను సినిమా హీరోగా చూడాలని వుంది. నీ బొమ్మ మన టూరింగ్ టాకీస్ లో వస్తే ఈలలు వేయాలని వుంది" అని అమాయకంగా అడిగితే...
"అంతేనా... సరే అయితే.. నీకోసం హీరోని అవుతాను..." అని సినిమా రాజధానికి వెళ్లి, అంచెలంచెలుగా హీరో స్థాయికి ఎదిగి... హీరోగా తన సినిమా అంతా చూస్తుంటే, తను మాత్రం... ఒక నిర్ణయం తీసుకున్నాడు...
ఈ నవల ఇన్నాళ్లకు మళ్ళీ ఇప్పుడు చదువుతున్నా అదే ఫ్రెష్ ఫీలింగ్..అదే ఎమోషన్
పల్లెటూరు నేపథ్యంలో అందమైన బావమరదళ్ళ స్వచ్ఛమైన ప్రేమకథ.
" గెలిచేవాడు కాదు గెలిపించేవాడే నిజమైన విజేత" అని చెప్పిన నవల
