చాలా సంవత్సరాల తరువాత నా చిన్నతనంలోకి వెళ్ళిపోయి,ఆనాటి మహత్తరమైన జానపద నవల చదివిన అనుభూతికి లోనయ్యాను.
" మాయాశిల్పం...మంత్రఖడ్గం" జానపద నవల సాహసాలను మంత్రతంత్రాలను టక్కుటమారా విద్యలను అంతకు మిక్కిలి అనతి రాజరికాన్ని జానపద నవలా వైభవాన్ని కళ్ళముందుకు తీసుకువచ్చినందుకు విజయార్కె గారికి ధన్యవాదాలు.
ముఖ్యంగా మేఘాలు పక్కకు తప్పుకోవడం,చంద్రుడు నీటికొలను నుంచి వైదొలగడం..లాంటి సన్నివేశాలు అద్భుతం.
కంటికి అక్షరాల విందును ఆహ్లాదాలతో సహా అందించిన నవల.
ఇలాంటి నవలలు మరిన్ని మీ కలం నుండి జాలువారాలి
