ప్రారంభంలోనే ఆకట్టుకునే కథనం.ప్రజల అమాయకత్వాన్ని వ్యాపారంగా చేసుకునే స్వామీజీల బండారాన్ని బయటపెట్టే అద్భుతమైన నవల,ప్రతీపాత్రకు ఒక గుర్తింపు.ప్రవల్లిక పాత్ర తీర్చిదిద్దిన విధానం బావుంది.రచయిత ఏ ఇతివృత్తం ఎన్నుకున్నా తనదంటూ వుండే ప్రత్యేకత శైలి కనిపిస్తూనే ఉంటుంది.
" ఎక్కడ ప్రజలు అమయకత్వం ఊపిరి పోసుకుంటుందో అక్కడ అవకాశ వాదం విష సర్పం ఈ వ్యవస్థను విషపూరితం చేయడానికి సిద్ధమవుతున్నది.
ఇరవై సంవత్సరాల క్రితం ఓ చిన్న సంఘటన ఈ దేశ ప్రశాంతతను భస్మీపటలం చేయడానికి ఆయత్తమవుతుంది.
రాత్రి లాకప్ రేప్ లు లాకప్ డెత్ లు లేనట్టున్నాయి. అందుకే పోలీసుస్టేషన్ ప్రశాంతంగా ఉంది. ఇంకా బోణి ఎప్పుడవుతుందో అన్నట్టుగా విసుగ్గా పోలీస్ స్టేషన్ ముందు టీ కొట్టువాడు నిలుచున్నాడు. పోలీస్ స్టేషన్ కేసులే వాడికి ఎక్కువ.
ఇరవై సంవత్సరాల తర్వాత మొదటిసారిగా పోలీస్ స్టేషన్ లోపలికి అడుగు పెట్టాడు రిటైర్డ్ మేజర్ భీష్మాచార్య. కూడా ఓ అమ్మాయ ఉంది. వయసు ఇరవై ఉంటుంది"
అద్భుతం
