అత్యున్నత సాంకేతిక విలువలతో ఒక హాలీ వుడ్ మూవీ చూస్తున్నట్టు వుంది.షర్మిల పాత్ర సులోచన పాత్ర,మేన్ రోబో ను డిస్ట్రాయ్ ఛాంబర్ లో వేస్తానన్నప్పుడు షర్మిల ఫీలింగ్స్,డెవిల్ సిటీ,చక్కని కథ అందుకుతగ్గ వాతావరణం,
నో ఫ్లైయింగ్ జోన్ లో విమానం ఎగరడం,అగ్నిహోత్ర కాపాడ్డం,ఒక గొప్ప సైంటిస్ట్ ను పిచ్చివాడిగా ముద్ర వేయడం,అదే సైంటిస్ట్ మేన్ రోబో ను సృష్టించడం ,ఆ మేన్ రోబో ప్రపంచాన్ని కాపాడ్డం,
ఒక మంచి సందేశాన్ని అద్భుతమైన కథనంతో ఏ ఎమోషన్ ని మిస్సవ్వకుండా అందించిన రచయితకు అభినందనలు.
రజనీకాంత్ రోబో కాంట్రావర్సీ ఈ నవల చదివాకా అర్థమైంది.ఒకే హీరో రెండు పాత్రలు పోషించే ప్రక్రియ విజయార్కె గారి నవలలో కొత్తగా చూపించారు.రోబో పాత్రలో,అగ్నిహోత్ర పాత్రలో ,
బాలకృష్ణ రాజశేఖర్ లాంటి హీరోలు కొత్తదనం కోసం ప్రయత్నించవచ్చు.రొటీన్ సినిమాలకు భిన్నంగా..
సెడక్ట్రస్ పాత్ర హార్ట్ టచింగ్ .
