కథలు లేవని చెప్పేవన్నీ కథలే.కథలు లేకపోతే ఈ కథలు విజయబాపినీడు గారి లాంటి డైరెక్టర్ ఎందుకు ఎంపిక చేస్తారు.హీరోలు ఎప్పుడూ మూసపోసినట్టు కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి విభిన్నమైన పాత్రలు పోషిస్తే బావుంటుంది.
మెగాస్టార్ ఇమేజ్ కు మెజీషియన్ పాత్ర సరిగ్గా సరిపోతుంది.,ముఖ్యంగా చిన్నారులు త్వరగా ఆ పాత్రకు కనెక్ట్ అవుతారు,
ఇదే పుస్తకంలో మెగాస్టార్ ను సైంటిస్ట్ పాత్రలో చూడాలని అనుకుంటున్నారా? అని క్యూ నవలలోని పాత్ర గురించి చెప్పడం బావుంది.
ఎందుకంటే చిరంజీవి గారు సైంటిస్ట్ పాత్ర పోషించిన దాఖలాలు లేవు.అందులోనూ గ్రహాంతర వాసుల కథ,
మేన్ రోబో నవలలోని " మేన్ రోబో " పాత్ర కూడా బావుంటుంది,
కుబేరాయనమః నవల చాలా బావుంది.
ఒకే నవలలో ఇన్ని కథలు..విషయాలు రీడబులిటీ చెడకుండా చెప్పిన విధానం సూపర్బ్ .
