మానవ భావోద్వేగాలను పాత్రలుగా మలిచి,చదివించే గుణాన్ని శైలిగా మార్చుకుని తన రచనల్లో వైవిధ్యాన్ని చూపించే విజయార్కె గారి ముద్ర కొట్టొచ్చినట్టు కనిపించే రచన..
అయితే ఇది సన్నివేశాలుగా ఉండడం వల్ల కొంత అసంతృప్తి.ఇదే నవలగా రాసి ఉంటే మరింతగా మాకు సంతృప్తి మిగిలేది.
విజయబాపినీడు గారికి మెగాస్టార్ చిరంజీవి సినిమాకు పంపించిన స్కీరిప్ట్ ను యథాతథంగా అందించడం వల్ల ఇది అనివార్యమని రచయిత పేర్కొండడం గమనార్హం.ఒక సినిమా స్క్రిప్ట్ చదువుతున్నట్ట్టు వుంది.చిరంజీవిగారు ఇలాంటి రెండు పాత్రలను మెజీషియన్ గా ,ఆర్మీ ఆఫీసర్ గా పోషిస్తే అభిమానులకు పండుగే.అబ్రకదబ్ర కథను ( కామెడీ ట్రాక్ ) ను హాసం పత్రిక ద్వారా అందించడం బావుంది.
ఈ కథను నవల రూపంలో చదవలేదనే అసంతృప్తిని ఇదే పుస్తకంలో అదనంగా అందించిన కుబేరాయనమః తీర్చివేసింది.
ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన హాస్యనవల.అల్లరి నరేష్,నిఖిల్ లాంటి వాళ్ళు చేయవలిసిన మంచి సబ్జెక్టు కుబేరాయనమః
