Comment(s) ...

పుస్తకాలు జీవితాలు మారుస్తాయా లేదో కానీ జీవితాన్ని మన కళ్ళముందు ఉంచుతాయి.నిర్ణయం నవల ఆ కోవకు చెందినది.మనసును కట్టి కుదిపేసిన నవల
నా కన్నడ స్నేహితురాలు ఈ నవల ( కన్నడంలో జీవనసంధ్య) కన్నడంలో చదివి బావుందని చెబితే..అదీ ఈ నవల మాతృక తెలుగు
( నిర్ణయం ) అని తెలిసి వెంటనే సెర్చ్ చేస్తే కినిగె లో ఇ బుక్ రూపంలో లభ్యమైంది.
తరువాత నా సహాధ్యాయి తన దగ్గరున్న స్వాతి కలెక్షన్స్ లో నుంచి ఈ నవల నా పుట్టినరోజు కానుకగా కానుకగా ఇచ్చింది.
1997 లో స్వాతి మాసపత్రికలో అనుబంధ నవలగా వచ్చిన ఈ నవలలో నాకు బాగా నచ్చిన అంశం...
త్యాగం పేరుతో పెద్దయ్యాక కూడా పిల్లలు తల్లిదండ్రుల మీద దాష్టీకాన్ని ప్రదర్శిస్తే కన్నప్రేమ అని సహించాలా? ఉహూ తిరగబడాలని కన్విన్సింగ్ గా చెప్పడం.
ఇప్పటికీ ఈ నవల .పిల్లలను తల్లిదండ్రులను ఆలోచింపజేస్తుందని నా విశ్వాసం
శ్మశానాన్ని వృద్ధుల ఆశ్రమంగా తీర్చిదిద్దిన తీరు.
కలెక్టర్ కూతురు తన బామ్మను ఓల్డ్ ఏజ్ హోమ్ లో కలుసుకున్న సందర్భం...
కంటికి కన్నీటితెరను తెప్పించింది.
ఈ నవల వచ్చినప్పుడు కొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులు.,
ఇప్పుడు విశ్రాంత జీవితంలోకి వచ్చాక ఆలోచిస్తే ఇంత మంచి నవలను అప్పుడు మిస్సయ్యాను అనిపిస్తుంది.
ఇది ఒక వ్యక్తిత్వవికాసపుస్తకం ,
అందరూ చదవాలి చదివి ఒక్కసారి వుద్ధాశ్రమాలకు వెళ్లి ఈ పుస్తకం గురించి చెప్పిరావాలి.
పిల్లలకు తల్లిదండ్రులకు ఈ పుస్తకం ఇవ్వండి.వాళ్లకు జీవితాన్ని పరిచయం చేయండి.

నిర్ణయం - విజయార్కె
Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

మధుబాబు గారు,

మీరు రాసిన అన్ని షాడో నవలల్లో నాకు అత్యంత ప్రీతి పాత్రమైనది, "టైగర్ మున్నా". అ పుస్తకంలో మీరు బహుముఖ ప్రతిభని చూపించారు. అందులో ఉకురు చాచా క్యారక్టర్ మరచిపోలేనిది.

మీవి అనేక పుస్తకాలు నేను కొని భద్రపరుచుకున్నప్పటికీ, "టైగర్ మున్నా" మాత్రం బైండ్ చేయించుకున్నాను. లెక్ఖ లేనన్ని సార్లు చదివాను.

ఒక ఐదు నిముషాల క్రితమే, కినిగే.కామ్ మీద డిజిటల్ ఎడిషన్ కొనుక్కున్నా

peru lone negitivity chala ekkuvaga undi , a pustakam ina a pathra ina manchi vishayaanni teeskovaali, pustakam index chadivaanu chaala chandalam ga undi …..

అడపా చిరంజీవి గారు మంచి చెయ్యి తిరిగిన రచాయిత నేను ఆయన అభిమానిని.
నా చిన్నప్పుడు ఆయన వ్రాసిన 'గాలిబంగ్లా' నవల నాకు ఇప్పటి కి గుర్తు. జానపద నవల 'ముసుగు వీరుడు' అద్భుతంగా ఉంది.

జానపద ప్రపంచాన్ని కళ్లకుకట్టిన నవల.రాజులు రాజ్యాలు కోటలు ఇలా ఆనాటి వాతావరణాన్ని కథలో కళ్ళముందు నిలిపాడు రచయిత.ముసుగుదొంగను మహావీరుడిగా పరిచయం చేసిన తీరు బావుంది.ఒక పాత్రను ముందే ఇతర పాత్రల ద్వారా పరిచయం చేసి కథానాయకుడిని అద్భుతంగా మలిచిన తీరు బావుంది.అడపా చిరంజీవి జానపద నవలల ప్రత్యేకత విభిన్నం.

Thank you for the suggestion. We are just working on to reduce the price of this book.

Subscribe
Browse