అమ్మా !
నమస్కారం
మీరు రాసిన పుస్తకం " నేను క్యాన్సర్ ని జయించాను " చదివాను.మనస్సు భారమైంది.మా అమ్మగారు క్యాన్సర్ తోనే కాలం చేసారు. మీరు క్యాన్సర్ ని ఎలా ఎదుర్కొన్నారో చదువుతుంటే కన్నీళ్ళొచ్చాయి.ఇలాంటి పుస్తకం ఆ రోజుల్లో ఉంటే మా అమ్మగారికి ,మాకు ఎంతో ధైర్యంగా ఉండేది.,
" మీలా మరొకరు ధైర్యాన్ని కోల్పోవద్దని " ఈ పుస్తకాన్ని రాసిన నేపథ్యం బావుంది.మీ తలవెంట్రుకలు రాలిపోతున్నప్పుడు మీరు పడ్డ బాధ,మీ అమ్మగారి ఆవేదన మీ అక్షరాల్లో ప్రస్ఫుటమైంది.
మీకు ఆ దేవుడు నిండు నూరేళ్ళ ఆయుష్షు ఇవ్వాలి.
ఈ పుస్తకాన్ని ప్రతీఒక్కరూ చదవాలి.జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలి.దురదృష్టవశాత్తు క్యన్సర్ బారిన పడితే " ఆ క్యాన్సర్ ని " తరిమివేసేందుకు ఈ పుస్తకం దోహదం చేస్తుంది.
