ఎప్పుడో పాతికేళ్ల క్రితం కథనం..ఇప్పుడెందుకు? జైలు గోడల మధ్య హీరో సుమన్ గడిపిన జీవితం ఎందుకు అవసరం?
జైలు గోడల మధ్య అతను పడ్డ తపన…నేర్చుకున్న జీవిత సత్యాలు.అతని మనో నిబ్బరం..తను నిర్దోషిని అనే నమ్మకం…
ఒక వ్యక్తిత్వ వికాసానికి కావలిసిన అంశాలు, ఒక పాపులర్ నటుడి స్వీయ అనుభవాలు చేదు నిజాలు,నిష్టుర సత్యాలు…
ఇప్పటి తరానికీ అవసరమయ్యే ఎన్నో విషయాలు…
ఈ ఇన్వెస్టిగేటివ్ సీరియల్ రాయడానికి అప్పటి ఆంధ్రభూమి సంపాదకులు పెట్టిన షరతు ఏమిటి? సుమన్‌ని ఎలా ఒప్పించడం జరిగింది?
ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి?
సూపర్ హిట్స్ బిజీగా వున్న హీరో…క్షణం తీరికలేని బిజీ షెడ్యూల్…షూటింగ్లో అలిసిపోయి ఇంటికి వచ్చాక ఓ రాత్రి తలుపు చప్పుడైంది. తలుపు తీస్తే పోలీసులు. ”మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామన్నారు”
ప్రపంచం తలక్రిందులు అవ్వడమంటే ఏమిటి?
ఒక హీరోను పోలీస్‌లు అరెస్ట్ చేయడమేమిటి?
తప్పు చేయకున్నా ఆరునెలలు జైలుగోడల మధ్య గడపడం ఏమిటి..?
లైట్స్ కెమెరా యాక్షన్ల మధ్య గడిపే హీరో జైలులో ఎలా వున్నాడు?
ఆంధ్రభూమిలో 1991 లో 24వారాలపాటు సీరియల్‌గా వచ్చి సంచలనం సృష్టించిన
ఫ్లాష్ బ్యాక్
జైలు గోడలమధ్య హీరో సుమన్
