డిటెక్టివ్ సాహిత్యంలో అడపా చిరంజీవి గారి రచనా శైలి విభిన్నం.
గాలిబంగ్లా లాంటి ( జ్యోతిచిత్ర పత్రిక నిర్వహించిన పోటీలో బహుమతి పొందిన ) నవల రాసిన తన కలం నుంచి వచ్చిన " మాయావి " ఆసక్తిని రేకెత్తించడంలో పరుగులు తీయించింది.
డిటెక్టివ్ రంగపాణి పరిశోధన , దెయ్యాల గురించి అన్వేషణ,అడుగడుగునా ఉత్కంఠ రేపే అక్షరాల సమ్మోహనం,
డిటెక్టివ్ నవలలు రాసే రచయితలు అతికొద్దిమంది మాత్రమే,వారిలో చాలా మంది రచయితలు డిటెక్టివ్ నవలలు రాయడం మానేశారు.
ఈ సమయంలో మాయావి లాంటి నవల ఆ లోటును తీర్చింది.చదివించే కథనం,అడుగడుగునా సస్పెన్స్ పాఠకులను ఆహ్లాదాల ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది
