పిల్లలు బాగా ఇష్టంగా చదివే పత్రిక చందమామ. ఆ మామ లేని లోటుని అడపా చిరంజీవి భర్తీ చేస్తున్నారు. చిరంజీవి జానపద నవలలు చదువుతుంటే చందమామ గుర్తుకు వస్తుంది.అంత బాగా పిల్లలను ఆకట్టుకునేలా సులభశైలిలో జానపద నవలలను అందిస్తోన్న చిరంజీవి ఒక విధంగా పిల్లలందరికీ మేనమామే ...! చందమామ లేకపోయినా ఈ మేనమామ మన పిల్లలకు వున్నాడు.కత్తులబోను నవల చదివిన తరువాత కామెంట్ ఏం రాద్దామా..అనుకుంటే , ఇదే సరైన కామెంట్ అనిపించింది. కొత్తదనం చూపించడంలో చిరంజీవిది అందెవేసిన చేయి. ఈ నవల చాలా చాలా బావుంది. నవల్లో కథానాయకుడు మణిదీపుడి సాహసాలు ఉత్కంఠ కలిగించేలా వున్నాయి. తిమ్మయ్య పాత్ర అద్భుతంగా వుంది. వెరసి నవల మొత్తం చివరివరకూ పట్టు వదలకుండా చదివించింది. జానపద నవలలు రాసేవాళ్ళు ఒకప్పుడు కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు అయితే , ఇప్పుడు ఈ తరంలో మధుబాబు, అడపా చిరంజీవి తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు.
