ఈ మధ్య చదివిన నవలల్లో బాగా గుర్తుండిపోయిన నవల మేన్ రోబో...ముఖ్యంగా అగ్నిహోత్ర పాత్ర...నవల చదువుతుంటే ఒక అద్భుతప్రపంచంలోకి వెళ్లినట్టు అనిపించింది.షర్మిల పాత్ర కళ్ళకు కట్టినట్టు వుంది...మేన్ రోబో తో ప్రేమలో పడ్డ సన్నివేశాల్లో కళ్ళు చెమర్చాయి .తాను ప్రేమించినవ్యక్తి ఒక మేన్ రోబో అని తెలిసాక డిస్ట్రాయ్ ఛాంబర్ లో వున్నప్పుడు అతని పెదవుల మీద ముద్దు పెట్టుకోవడం.మేన్ రోబో తన ఎమోషన్స్ చూపించడం సూపర్బ్
2002 లో వచ్చిన ఈ నవల చాలా ఆలస్యంగా చదివినందుకు ఫీల్ అవుతున్నాను.ఒక డిటెక్టివ్ నవల ఒక థ్రిల్లర్ ఒక సస్పెన్సు నవల ఇలా అన్ని ఎమోషన్స్ ను అందించిన నవల మేన్ రోబో..ముఖ్యంగా సులోచన పాత్ర.
