సూపర్ స్టార్ రజనీకాంత్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన రోబో సినిమా సమయంలో చిన్న వివాదానికి తెర లేసింది.
రోబో మేన్ రోబో లో కనిపించే రెండు పోలికలు …హీరో ద్విపాత్రాభినయం …హీరో రోబో గా నటించడం …హీరో రోబో రెండు పాత్రలను ఒకే వ్యక్తి పోషించడం…క్లారిఫికేషన్ కోసం మీడియా ముందుకు రాక తప్పని పరిస్థితి.టీవీ చానెల్స్ లో వచ్చిన లింక్ చూస్తే…మేన్ రోబో వివాదానికి కారణం తెలుస్తుంది.
రోబో పేరుతొ సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమా విడుదలకు ముందే మేన్ రోబో కు రోబో కు మధ్య కాంట్రవర్సీ మీడియాలో వచ్చింది.ఎందుకంటే ఒకే వ్యక్తిని పోలిన మరో వ్యక్తి వున్నప్పుడు మన తాలూకు వ్యక్తి ఎవ్వరో పోల్చుకోవడం తప్పనిసరి. తెల్చుకోవదమూ తప్పనిసరి.ఆ ప్రయత్నమే నేను చేశాను.వీలయితే యు ట్యూబ్ లో మీడియాలో వచ్చిన కథనాలు.నా ఇంటర్ వ్యూ చూడవచ్చు.
( ఎన్టీవీ ,సాక్షి)
https://www.youtube.com/watch?v=M88JkxxsGU0
రోబో మేన్ రోబో వేరు వేరు ….అని ట్విన్స్ మాత్రమే అని ఈ వివాదం ద్వారా తెలియజెప్పడం నాకు అనివార్యం అయ్యింది.
మేన్ రోబో నవల చదివితే ఈ విషయం మీకు స్పష్టమవుతుంది.
ఒక విధంగా రోబో మేన్ రోబో కవలలు లా అనిపిస్తారు.ఒకే కాన్సెప్ట్…కథాంశం వేరు కావచ్చు.అసలు విషయం తెలియనప్పుడు కన్ఫ్యూజన్ తప్పనిసరి కదా ! ఒక హీరో…మరో హీరో ..ఇద్దరు ఒకేలా వుంటారు ..కానీ అన్నదమ్ములు కారు…మిత్రులు కారు…అసలు ఇద్దరిలో ఒకరు మనిషి కాదు.అచ్చు హీరోలా వున్న రోబో (యంత్రం) సినిమా పరిభాషలో ద్విపాత్రాభినయం.
మేన్ రోబో లోనూ.సూపర్ స్టార్ రజనీ కాంత్ రోబో లోనూ వున్న అతి కీలకమైన పోలిక…
2002 లో నేను రాసిన మేన్ రోబో నవలకు ..
2010 లో వచ్చిన రోబో సినిమా కాంట్రవర్సీకీ ముఖ్యమైన కారణం ఇదే…
ఈ నవలలో అగ్నిహోత్ర పాత్రను మేన్ రోబో డామినేట్ చేస్తుంది…
మేన్ రోబో ఎవ్వరో తెలియక అగ్నిహోత్రగా భావించి మేన్ రోబోప్రేమలోపడ్డ సిబీఐ డిప్యూటీ చీఫ్ షర్మిల…కు ఆ నిజం తెలిసేసరికి ఏమవుతుంది? భార్యాబిడ్డలు ప్రపంచం పిచ్చివాడుగా ముద్ర వేసిన రిచర్డ్ చేసిన ప్రతిసృష్టి మేన్ రోబో కు అగ్నిహోత్రకూ సంబంధం ఏమిటి?
ఈ ప్రశ్నలకు సమాధానమే మేన్ రోబో…
మనిషికీ మరమనిషికీ వున్న అనుబంధం ,సంబంధం భావోద్వేగాల సమ్మేళనం ఈ నవల.
