Comment(s) ...

ఆసక్తికర నవల
భావన, ఊహ, సృజనాత్మక శక్తులు దాదాపు అంతరించిపోయి ఒక గాడిలో పడి యాంత్రికంగా చరిస్తున్న తెలుగు నవలా సాహిత్యంలో ఎన్.ఆర్. నంది తరువాత సైన్స్ ఫిక్షన్ విభాగంలో కొంతలో కొంత ఆ లోటును తీరుస్తూ వెలువడిన సైన్స్ ఫిక్షన్ నవల డాక్టర్ చిత్తర్వు మధు రాసిన 'కుజుడి కోసం'.

క్రీస్తు శకం 3264 సంవత్సరం లో భూమిపైన రెండుసార్లు అణుయుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు జరిగిన తర్వాత, భూమి నుంచి అన్ని దేశాల ప్రజలు ఇతర గ్రహాల్లోకి వలసపోయి నివసించే రోజుల్లో, భూమి మీదే నివసించే ఒక బయో మెడికల్ ఇంజనీర్ తన కలలో కనిపించిన ఒక కుజగ్రహ సుందరి ప్రేమను పొందాలనే ధ్యేయంతో కుజగ్రహానికి చేసిన ప్రయాణంలో జరిగిన సంఘటనలే ఈ నవలకు మూలాధారం. ఆ తర్వాత కుజగ్రహంలోని మాంత్రికులకూ, మానవులకూ జరిగిన యుద్ధంలో అతను చిక్కుకోవడం దగ్గర్నుంచి తిరిగి అతను భూమిని చేరేవరకూ జరిగిన ఘటనలను ఆసక్తికరంగా నవలీకరించాడు రచయిత. అరవై రెండు అధ్యాయాలు ఈ నవలలో గతాన్నీ, భవిష్యత్తునూ మిళితం చేసి అద్భుతమైన ఫాంటసీని సాధించాడు. ఈ క్రమంలో రోబోలు, ఇంటర్ గెలాక్టిక్ నెట్ వంటి ఎన్నో సాంకేతిక అంశాలను సాధారణ పాఠకులకు అర్థం అయ్యేట్టు రాయడం ఈ నవల ప్రత్యేకత.

పునరుక్తులను కొంచెం ఎడిట్ చేసుకుని ఉంటే నవలలో మరింత 'బిగి' ఉండేది. అలాగే నవలలోని శాస్త్రీయతను మరికొంచెం సరళీకరించినా నవలా క్రమం ఒక గతిలో సాగిపోయేది. మొత్తం మీద చాలాకాలం తర్వాత వెలువడ్డ ఈ సైన్స్ ఫిక్షన్ నవల ఆ అభిరుచి గల పాఠకుల్ని విడవకుండా చదివిస్తుంది. అలాగే కుజగ్రహం గురించి శాస్త్రీయ వివరాలు తెలుసుకోవాలన్నవారు కూడా ఈ పుస్తకాన్ని చదవొచ్చు.
కుజుడి కోసం, డాక్టర్ చిత్తర్వు మధు Reviewed by Andhrajyothy aadivaram 25-11 2013

కుజుడి కోసం
Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

the preview's option on kinige are bad. we can't judge a book by just seeing some first 10 pages.
at least the contents have to be present and 5-10 pages of the 1st or 2nd chapter also have to be there.

Please send satya harichandra book

నమస్తే, మీది నాది భిన్న దృక్కోణం. అయినా మీ రచనలో ఉన్న సహజత్వం నాకు బాగా నచ్చింది. అనేకమంది వామ పక్ష రచయితలు తమ అభిప్రాయాలను వెల్లడించడం కోసం అనేక రకాల అబద్దాలకు, మితి మీరిన అసహజ ప్రయోగాలకు పూనుకొంటున్నారు. అలంటి స్థితిలో మీ ముందు సమాజం లో కనిపించిన విషయాలను ఉన్నది ఉన్నట్లు నిజాన్ని రాయడం ఏ కొద్ది మందికో చెల్లింది. బొజ్జా తారకం, అంబేద్కర్ వంటి రచయితల రచనలు కాల పరీక్షకు నిలువవు ఎం

Please enable Google pay or phone pe for recharge

Subscribe
Browse