డబ్బా కథ... మధుబాబు గారి జానపద కథలంటే చాలా ఇష్టపడే నేను, ఈ పుస్తకాన్ని కూడా అంతే బాగుంటుందని అనుకుని చదివాను... కథ అయిపోగొట్టాలనే ఉబలాటమే కనబడింది నాకు.. ఏంటో కథ గెంతుతూ ఉంటుంది... ఎక్కడా లాజిక్ ఉండదు.. పైగా ఆడవాళ్ళ గురించి రెండు మూడు చోట్ల తక్కువ చేస్తూ రాయడం.. షబ్నం ఇండియాలో ఉండే ఒక ముస్లిం ఆవిడ... ఆవిడ ప్రియుడి కోసం విదేశాలకి వెళ్ళాల్సొస్తుంది.. అయినంత మాత్రాన వక్షోజాలు కనిపించేలా బిగుతుగా జాకెట్ వేసుకోవదం... కథ కోసం అలా రాయక్కర్లేదు.. పైగా ఆమె ఆత్మాభిమానం లేని ఆవిడ కూడా కాదు కథ ప్రకారం.. రచయితకి ఆడవాళ్ళకి అలాంటి జాకెట్లు వెయ్యడం ఇష్టం..
ఇంకో చోట, ఓడ అటూ ఇటూ ఊగుతుంది, షబ్నం కిందపడి మళ్ళీ లేచి కూచుంటుంది.. తుఫాను గురించి భయపడుతుంది.. ఆవిడ పైట జారిపోయి వక్షోజాలు కనిపిస్తూ ఉంటాయి.. చీర కింద నుండి మోకాళ్ళ మీదకి వస్తుంది... అయినా ఆవిడ పట్టించుకోదు...
ఇంకో దగ్గర, ఓడలో తుఫాన్ కి భయపడి షాడో ని కౌగిలించుకుంటుంది... అక్కడ ఇలా రాసాడు రచయిత "అతని వేళ్ళు ఆమె కోర్కెలని నిద్ర లేపుతున్నాయి.. ఆమెని రెచ్చగొట్టాడు షాడో.. శరీర వాంఛలకి లొంగి పోయింది షబ్నం.. ఆమెకి అక్కడే మంచం మీద నిద్రపోతున్న ఆమె అత్తా, ప్రియుడు ముస్తాఫా ఎవరూ కనిపించలేదు... ఎగబడి ఆమె కోర్కెని తృప్తి పరుచుకుంది..." ఎవరు కౌగిలించుకున్నా ఇంతేనా? అంతకుముందు షాడో ఆమెకి పరిచయం లేదు.. కొత్త.. ఎవరు ఓదార్చినా వాళ్ళని వాటేసుకుని, కోర్కెలని తృప్తి పరచుకుంటుంది గావును...
ఆ తర్వాత షబ్నం కి షాడో అంటే ప్రేమ ఉన్నట్టు రాస్తాడు.. కానీ భయపడి కౌగలించుకుని, కోర్కెలు రేగి, తృప్తి పరుచుకుందని రాయాలా? పాత సినిమాల్లో వర్షం, ఉరుము, కౌగిలింత...లా ఉంది..
ఇంకో చోట "చక్కర కేళీ లాంటి షబ్నం పక్కన ఉన్నా పట్టించుకోలేదు" అని రాసాడు.. చక్కర కేళీ లా కథలో పాత్రకి అనిపించాలి.. "అతనికి చక్కర కేళీ లా అనిపించినా పట్టించుకోలేదు" అని రాయాలి.. కానీ రచయితే ఆవిడని చక్కర కేళీ అనడం..
ఇంకోచోట " ఆడదాన్ని కదా, అంత తొందరగా నాకు అర్థం చేసుకునే శక్తి ఉండదు" అని రాసాడు.. దీని అర్థం ఏంటి?
ఆడవారి సంగతి పక్కన పెడితే, షాడో పాత్ర ని కూడా తక్కువగా చూపించాడు...
షాడో షబ్నం వక్షోజాలు చూడగానే కొంచెం రెచ్చిపోయి, ఇలా ఆలోచిస్తున్నానేమిటి అనుకుంటాడు.. అంతవరకూ బానే ఉంది.. కానీ వెంటనే షాడో అంతరాత్మ "పెద్ద ఋష్యశృంగుడిలా పోజు కొడతావేంటి" అని షాడో ని అడుగుతుంది.. దీని అర్థం ఏంటి? అసలు షాడో పెద్ద నీతి గల వాడేమీ కాదని షాడో అంతరాత్మే చెప్తోంది.. దీనికి బదులుగా అదే అంతరాత్మ "ఇలా చెయ్యడం తప్పే.. కానీ దేశం కోసం తప్పదు" అని చెప్తే ఎంత బాగుండేది? పోనీ షాడో ఒంటరి వాడు కాదు.. తనకి ఆల్రెడీ ప్రియురాలు ఉంది... అదే ప్రియురాలికి షాడో బాధ్యత అప్పగించి, ఇలా ఎవరితోనో పడుకోవాల్సి వస్తే (దేశం కోసమే), ఆమె అంతరాత్మ ఆమెని "పెద్ద పతివ్రతలా పోజు కొడతావేంటి?" అని అడిగితే ఆమె వ్యక్తిత్వం గురించి మనం ఏం అనుకుంటాం? మరి షాడో వ్యక్తిత్వాన్ని కూడా రచయిత దిగ జార్చలేదా?
రచయిత కి ఋష్య శృంగుడి గురించి తెలీదు (రామాయణం లో ఉంటుంది లెండి), ఋష్య శృంగుడు ప్రవరుడిలా అమ్మాయిలకి దూరంగా ఉండేవాడని ఎక్కడా లేదు... పాఠకులకేం తెలుస్తుందిలే అని రాసే ధోరణి ఇది..
ఇవి పక్కన పెడితే కథ ఎంత డబ్బాలా ఉండాలో అంత డబ్బాలా ఉంది.. భూగోళం సైజు డబ్బా..
