హాయ్ సార్,
మీ పుస్తకాలు, మీ కధలు, మీ రచనలు నాకు మొదటి నుండి తెలియవు. ఒక రొజు ఒపెన్ హార్ట్ విత్ RK చూసా. అప్పుడు మీ పుస్తకాల కోసం వెతకటం మొదలుపెట్టా. హైదరాబాదులో ఉండిఉంటే కోఠి వెళ్ళీ వెతుక్కుని కొని ఉండేవాడిని. చాలా ఆలస్యంగా కినెగె గురించి తెలిసింది.
సాయంకాలమయింది చదివాను. నచ్చింది సార్. చదవటం మొదలుపెట్టింది చాలా రోజులముందే అయినా మధ్యలో పని హడావిడుల వల్ల చదవటం కుదర్లేదు. ఇవాళ్తికి అయ్యింది. వెంటనే మీకు ఈమేల్ చేయాలి అని అనిపించి ఇక్కడ చేస్తున్న. మీరు చెప్పినంత ఆచారాలు అర్ధం కాకపోయినా పెరిగిన విన్న వాతావరణాన్ని బట్టి విషయం అర్ధం చేసుకున్నా.
నా కామెంట్ "అమ్మ ప్రేమని గొల్లపూడి మాటల్లో చదివితే, ఏడవకుండా ఉండటం ఎవ్వరివల్లా కాదు. మంచి ఫీల్ ఉన్న ఒక మంచి నవల. అమ్మా నాన్నలకి దేశానికి దూరం అయిన వాళ్ళ అవసారాలని సమర్దిస్తూ, వెళ్ళిన వారి భాద్యతలు వివరించి చెప్పిన ఒక చక్కని కధ. "
Regards
Pavan