నవల ఇతివృత్తం చాలా బావుంది. ఇందులో ఏడు తరాల కథని చాలా నేర్పుగా రచించారు.
ముఖ్యంగా నాకు బాగా నచ్చిన ఘట్టం పొన్ని-వకుళ ప్రేమ కథ. ఇందులోని వకుళ పాత్ర నా మనసులో చాలా బలంగా నాటుకుపోయింది.
6-8 వ శతాబ్దం మన తెలుగు చరిత్రని రూపుమాపింది. తెలుగు సాహిత్యానికి పునాది ఏర్పడింది ఆ కాలంలోనే. ఈ నవలలో మన తెలుగు సాహిత్యం ఎలా పరిణామం చెందిందో అది విశద పరిచారు.
మన తెలుగు రెండు మహా సామ్రాజ్యాలు, వేంగీ చాళుక్యులు మరియు పల్లవులు, పాలించారు. వీళ్ల రాజ్య విస్తరణ కాంక్షతో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఈ రెంటి రాజ్యాల మధ్య నలిగిపోయిన బోయిల చరిత్ర వృత్తాంతమిది.
తెలుగు లిపికి ఆనవాలుగా నిలిచిన అద్దంకి శాసనంలోని బోయకొట్టములు పండ్రెండుని ఆధారంగా తీసుకుని రచించిన దృశ్యకావ్యం ఇది.
