Devarakonda Balagangadhara Thilak
దేవరకొండ బాలగంగాధర తిలక్
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలుకా మండపాక గ్రామంలో 1921 ఆగష్టు 1 న జననం. 1966 జూలై 1 న మరణం.
'అమృతం కురిసిన రాత్రి' ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది.
తిలక్ అనగానే గుర్తొచ్చేది... అమృతం కురిసిన రాత్రి. తిలక్ పేరు తలచుకోగానే 'నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు' అన్న వాక్యం స్ఫురించకతప్పదు. తిలక్ కవిగానే కాదు, కథకుడిగా కూడా తనదైన ముద్ర వేసారు. తిలక్ మద్రాస్ లయోలా కాలేజిలోనూ, విశాఖ ఎ.వి.ఎన్. కాలేజిలోనూ ఇంటర్ చదువుతూ, అనారోగ్య కారణాల వల్ల ఆపేసారు. తణుకులో విజ్ఞాన పరిషత్ స్థాపించారు. తర్వాతి కాలంలో దానినే 'సాహితీ సరోవరం'గా మార్చారు. తిలక్ కవితలు, కథలే కాదు, నాటకాలు కూడా రాసారు. బృందావన కళా సమితి అనే సంస్థని స్థాపించి నాటకాలు వేయించారు. మన కళ్ళ ఎదుట ప్రతి నిత్యం జరిగిపోతున్న జీవిత నాటకాన్ని ప్రతిబింబించడానికి ఆయన కవితను, కథలను, నాటికా ప్రక్రియను ఉపయోగించుకున్నారు. రోజూవారీ జీవితంలో మనకు తారసపడే అభాగ్యులను, మోసగాళ్లను ఆయన పాత్రలుగా తీసుకుని అసలు రూపాలతో మన ముందు నిలబెట్టారు. తిలక్ తన మొదటి కథని 11 వ ఏట రాసారు. 'మాధురి' పత్రికలో ప్రచురితమైన ఆ కథ ఇప్పటికీ అలభ్యం. ఆయన 16 ఏళ్ళకే రాసిన పద్యాలు, గేయాలు 'ప్రభాతము - సంధ్య' పేరుతో 1938లో తొలి సంపుటిగా వచ్చింది. గోరువంకలు, కఠినోపనిషత్తు, అమృతం కురిసిన రాత్రి ఇతర కవితా సంకలనాలు. తిలక్ మరణానంతరం కుందుర్తి ఆంజనేయులు పీఠికతో 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది. తిలక్ కథలు, సుందరీ-సుబ్బారావు, ఊరి చివరి యిల్లు తిలక్ కథా సంకలనాలు. సుశీల పెళ్లి, సుప్త శిల, సాలె పురుగు తిలక్ రాసిన నాటకాలు. 1956-66 మధ్య కాలం తిలక్ రచయిత శిఖరారోహణ చేసిన కాలం.

Books from Author: Devarakonda Balagangadhara Thilaksubscribe

Comment(s) ...

అమృతం కురిసిన రాత్రి కావాలండి

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

super stories
*ఎన్నో రాత్రుళ్లు కూడా మీ చేతివ్రేళ్ళు నిరంతరాయంగా స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌ని టచ్ చేస్తూనే ఉంటాయి... ఎలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ లేని ఒకానొక చరవాణి మీ జీవితంలో సృష్టించే శూన్యత మీకు అర్థమవుతుందా?ఎమోషన్స్ ఫీలింగ్స్ వున్న మీ భార్యను ఎన్నిసార్లు టచ్ చేస్తున్నారు
భర్తలు చెప్పలేని సమాధానం.. భార్యలకు అర్థం కాని సందేహం... ఈ సందేహానికి సమాధానం... స్మార్ట్ ఆన్సర్ ఏమిటి?
స్మార్ట

దంపతులు ఏకాంతంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఈ కథలను చదవాలి.బెస్ట్ రొమాంటిక్ సిరీస్ ప్రతీ కథలో రొమాంటిక్ టచ్ హార్ట్ ను టచ్ చేస్తుంది.రచయిత చెప్పినట్టు ...
ఉదయమంతా అలసట ...వృత్తిపరమైన వ్యక్తిగతమైన సమస్యలు...వాటిని పడగ్గది బయటే వదిలేయండి.
స్పా లకు వెళ్లినా,విహారయాత్రలకు వెళ్లినా ఎంత ఖర్చుచేసినా లభించని గొప్ప అనుభవం..అనుభూతి మీ ఇద్దరి కలయికలోనే వుంది.
కౌగిలిని మించిన గొప్ప సెక

విభిన్నమైన కథల పుస్తకం.ఎవరికీ నచ్చిన జోనర్ లో వాళ్ళు వాళ్లకు నచ్చిన కథ చదువుకోవచ్చు.హారర్ క్రైమ్ అడ్వెంచర్ కామెడీ జానపద కథ ,ఇలా పాఠకులకు షడ్రసోపేత అక్షరాల విందు అందించిన రచయితకు కృతఙ్ఞతలు.కినిగెకు ధన్యవాదాలు.

నిజంగా స్మార్ట్ టచ్ కథలే,హార్ట్ ను టచ్ చేసే కథలే,అన్ని జోనర్స్ లో కథలు ఇవ్వడం బావుంది.స్మార్ట్ టచ్ మనసును టచ్ చేసింది.దంపతులు తప్పక చదువవలిసిన కథ.చైనా కరోనా కథ నవ్విస్తూనే ఆలోచించమని చెబుతుంది.క్రైమ్ అడ్వెంచర్ హారర్ జానపద కథ..కథాప్రియులకు చక్కని కాలక్షేపం....

మనకు నచ్చిన కథలను చదువుకునే అవకాశం.కామెడీ.హారర్.క్రైమ్,అడ్వెంచర్,మానవ సంబంధాలు,ఫిక్షన్.జానపద కథ.ఇలా రచయిత అన్ని జోనర్స్ లో ,ప్రముఖ పత్రికల్లో విభిన్నమైన తనదైన శైలితో రాయడం గొప్ప విషయం.ఒక్కో కథలో ఒక్కో ఎమోషన్ .ఉత్కంఠ .కథ చివరివరకూ చదివించే లక్షణం.మనసుకు ఆహ్లాదాన్ని,ఆలోచనను చక్కని కాలక్షేపాన్ని ,అంతకు మించి ఒక గొప్ప ఫిల్ ని కలిగించే కథలు.
స్మార్ట్ టచ్ సరికొత్త పాయింట్ .కథలన్నీ

Subscribe
Browse