Chellapilla Venkata Sastry
చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీప గ్రామం కడియంలో 8, ఆగస్ట్ 1870 నాడు జన్మించారు.

శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి అవధాన విద్యకు రూపురేకలు తీర్చిదిద్ది, వన్నె వాసి సమకూర్చిన తిరుపతి వేంకట కవులలో ఒకరు. ''గోణము (గోచి) కట్టుటాది బుధకోటి నుతింపఁ గవిత్వము'' చెప్పనేర్చిన వారు. సరస చమత్కారవచో మాధురీ ధారలను ఆంధ్రదేశమంతా ఎడతెరిపి లేకుండా వర్షించి, వర్షించి కూడ వట్టిపోని కాలమేఘం. రంగస్థల నాటకాల తరహాలో కాకుండ, శాస్త్రీయ సంగీత ధోరణిలోనూ కాకుండా మృదుగంభీర స్వరంతో, శ్రోతలు ఉఱ్ఱూతలూగేటట్లు రాగచ్ఛాయతో మానసమానందపడేటట్లు పద్యం చదవగలిగిన పండితుడు.

''కవనార్థం బుదయించిన'' వేంకటశాస్త్రి గారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీప గ్రామం కడియంలో 8, ఆగస్ట్ 1870 నాడు జన్మించారు. తల్లిదండ్రులు చంద్రమ్మ, కామయ్య. బ్రాహ్మణ శాఖలలో ఒకటైన ద్రావిడులలో ఆరామ ద్రావిడ అనే అంతశ్శాఖకు చెందినవారు.

జంటపేర్లు సొంపుగా కుదిరిన అతి కొద్దిమంది భాగ్యశాలురలలో ఒకరు తిరుపతి వేంకట కవులు. మొదట వారు అన్నా కూడా తప్పు లేదేమో. వారు పుట్టింది 19వ శతాబ్దంలో. 1890 నుండి విస్తరించడం మొదలుపెట్టిన వారి కీర్తి కౌముది ధాళధళ్యం ఇప్పటికీ వెలవెలబోలేదు సరికదా ఎప్పటికప్పుడు కొత్త మెఱుగు చూపుతూ ఉంది.

Books from Author: Chellapilla Venkata Sastrysubscribe

Comment(s) ...

I need this book. Please call to 9986238877 if available. Thank you.

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

సైన్స్ ఫిక్షన్ లో విజయార్కె గారు గొప్ప నవలలు రాశారు. అయన ఏ నవల రాసినా లోతుగా పరిశోధించి, పరిశీలించి పాఠకుల గుండెను తాకేలా రాస్తారు. ఆ కోవలోకి వస్తుంది ఈ 'నరుడా ఏమి నీ కోరిక' నవల. శైలి అద్భుతంగా ఉంది. నవల ఎత్తుగడ, కథను మలుపులు తిప్పిన విధానం అమోఘం. ఊపిరి బిగపట్టి చదివించే గుణం ఈ నవలకు ఉంది. కీప్ ఇట్ అప్.
- మోహనరావు దురికి (రచయిత,

జానపద సాహిత్యం అంతరించిపోతున్న నేటి హైటెక్ యుగంలో అడపా చిరంజీవిగారు 'ముసుగు వీరుడు' జానపద నవల రాయడం మెచ్చుకొదగ్గ విషయం. జానపద సాహిత్యంలో ఇతనికి పోటీ ఎవరు లేరు అనొచ్చు. ఎందుకంటే మరిచి పోయిన కాలనీ మళ్ళి గుర్తుకు తెచ్చి నేటి కాలానికి ముడివేసి పాఠకుడిని మంత్రముగ్దుడ్ని చేయడం అంత సులువు కాదు. వంట తెలిసిన వాడు గడ్డిపోచతో కూడా ఉలువ చారు చేసి తినిపించగలడు. 'ట్రంప్ కార్డు' లాంటి సంచలన

నాకు తెలిసి జాలాది రత్న సుధీర్ గారు ప్రముఖ కవి, రచయిత. అతను మొదటిసారి 'సెల్ఫ్ హెల్ప్' మీద 'విజయానికి ఏడు సూత్రాలు' పుస్తకం రాయడం, అందులోను ప్రపంచాన్ని ఏలుతున్న ధనవంతులు ఎలా ఆ స్థాయికి ఎదిగారో వివరిస్తూ వ్యాసాలు రాయడం చాలా మంచి ప్రయత్నం. లోగడ ఇతను - యువకులు ఎలా విజయం సాధించాలో వివరిస్తూ 'టిప్స్' ఇస్తూ 'ఇంస్ట్రా గ్రామ్' లో పలు ప్రసంగాలు చేశారు. ఆ వీడియోలు వైరల్ గా మారి వేలాది యువకుకు అ

Good book time pass

I like the folklores. It is a fantastic book to read. This novel hasn't disappointed me. The main plot of this novel is still relevant. I am expecting big novels from the author.

Subscribe
Browse