Tripura
త్రిపుర
2, సెప్టెంబరు1928న జననం. 24 మే 2013న మరణం
తన రచనలలో మార్మికతకు పెద్దపీట వేసి, కేవలం 15 కథలతోనే చదువరులను అభిమానులుగా మార్చుకున్న రచయిత త్రిపుర. మొదటి కథ 31-5-1963 నాటి ఆంధ్రపత్రికలో ప్రచురితమవడంతో ప్రారంభమైన ఆయన సాహితీసృజనకి 2012-13 నాటికి యాభై సంవత్సరాలు పూర్తవుతాయి. త్రిపుర కథల విలక్షణత అయన ఎత్తుగడలో ఉంటుంది, మొదటే అర్థం కాలేదని పుస్తకం పక్కన పడేస్తే మాత్రం కొన్ని అద్భుతమైన కథలని కోల్పోయిన వారవుతారు. మొదట అర్థం కానట్టు అనిపించినా, చదివే కొద్దీ కొత్త భావాలేవో అనుభవంలోకి వస్తున్నట్లు, మళ్ళీ మళ్లీ చదవాలనుకుంటారు పాఠకులు. కథలు సంక్లిష్టంగా అనిపిస్తాయి, వాటి పరిథి పెద్దది - ఫ్లోరిడా, వారణాశి, కేరళ, రంగూన్, థాయిలాండ్, సరిహద్దు ప్రాంతాలు - ఎన్నో చుట్టి వస్తాయి యీ కథలు. జెన్ బౌద్ధం మొదలు నక్సలిజం దాకా అనేక శ్రేణుల్లో తత్త్వచింతన ఈ కథల్లో ఉంది. చదివేకొద్దీ, మరింతగా చదివించే గుణం ఉన్న కథలివి. త్రిపుర కథలే కాకుండా కవితలూ అద్భుతంగా ఉంటాయి. తన 47వ పుట్టిన రోజు సందర్భంగా " సెగ్మెంట్స్" అనే ఆత్మకథాత్మక దీర్ఘకవితని రాసారు. దీన్ని మరో ప్రముఖ కవి వేగుంట మోహన్ ప్రసాద్ త్రిపుర స్వశకలాలు పేరుతో తెలుగులోకి అనువదించారు. ఫ్రాంజ్ కాఫ్కాకి వీరాభిమాని అయిన త్రిపుర ఆయన ప్రేరణతో, "త్రిపుర కాఫ్కా కవితలు" రాసారు. కాఫ్కా రచనల్లోని నిగూఢత్వం ఈ కవితల్లోనూ గోచరిస్తుంది. ఈ పుస్తకాన్ని "సాహితీమిత్రులు" ప్రచురించారు. 1980 - 1988 మధ్యలో త్రిపుర రాసిన 16 కవితలని "కవిత్వం ప్రచురణలు" వారు "బాధలూ -సందర్భాలూ" అనే శీర్షికతో నవంబరు 1990లో ప్రచురించారు. చక్కని సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి ఈ త్రిపుర రచనలు. రచయితల రచయిత త్రిపుర.

Books from Author: Tripurasubscribe

Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

I purchased this book and followed every damn steps to download and not able to read or download. Please help

NS Nagireddy gari "Killer" telugu detective novels total list ekkada vuntayi

Excellent book ... Author narrated the J.K philosophy and living with awareness in understanding manner.
Thank you

Hi sir ug మీద రాసిన తెలుగు పుస్తకాలు ఇంకా ఏమన్నా ఉన్నాయా

ఈ పుస్తకాన్ని ఎంతో ఇష్టంతో మూడుసార్లు చదివాను.చదివి నిజమైన సంతృప్తిని ఇచ్చే ఇష్టమేమిటో తెలుసుకున్నాను.మనల్ని మనం స్కాన్ చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఎంతో దోహదపడుతుంది,
మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి,అసంతృప్తిని జయించండి..ఈ పుస్తకాల తరువాత మళ్ళీ ఇష్టంగా చదివిన పుస్తకం .

Subscribe
Browse