-
-
మనసు తలుపు తెరిస్తే
manasu talupu teriste
Author: Sravanthi Itharaju
Publisher: Chandan Publications
Pages: 216Language: Telugu
మనసు తలుపు తెరిస్తే... పుస్తకం పేరు వినగానే ఒక క్రొంగొత్త భావన మనకు కలుగుతుంది. ఏవిధంగా ఐతే ఒక ఇంటి తలుపు తెరవగానే ఆ ఇంటిలోని వస్తువుల అమరిక, ఇల్లాలి నైపుణ్యం తెలుస్తాయో అదే విధంగా ఈ "మనసు తలుపు తెరిస్తే" మొదటి పేజీ తిప్పగానే రకరకాల మనస్తత్వాలు దర్శనమిచ్చి మనల్ని తబ్బిబ్బు చేస్తాయి.
మన దేశంలో దాదాపు రెండు కోట్లమందికి పైగా రరకాల మానసిక వ్యాధులతో బాధపడుతూ, తమ చుట్టూ వున్న వారినీ బాధ పెడ్తున్నారు. శరీరానికెలా జలుబు, జ్వరం వస్తాయో మనసుకి కూడా కొన్ని మానసిక రుగ్మతలు వస్తాయి, అవి మన ప్రవర్తన ద్వారా బయటపడతాయి.
ఇలాటి మానసిక వ్యాధులలో కొన్ని ముఖ్యమైనవి ఉదా: డిప్రెషన్, మానియా, ఫిటియస్డి, ఆటిజం, బైపోలార్ డిజార్డర్, పారాఫీలియా, డిమెన్షియ, జువెనైల్ డెలిక్వెన్సీ, స్లీప్ డిజార్డర్ లాంటి కొన్ని ముఖ్యమైన మానసిక రుగ్మతలు మన సమాజంలోని వ్యక్తులలో ఎలా ఉంటాయో వివిధ పాత్రల రూపంలో చాలా అందంగా, హుందాగా, సరళమైన శైలిలో సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా రచించారు శ్రీమతి ఐ.యస్.స్రవంతి గారు.
స్రవంతి ఐతరాజు గారు సోషియాలజీ, సైకాలజీలలో పి.జి.పట్టభద్రురాలే కాకుండా రీహాబిలిటేషన్, కౌన్సిల్లింగ్ సైకాలజీ ల్లోనూ పలు డీగ్రీలు చేసారు. మనస్తత్వశాస్త్రంలో పరిశోధకురాలు. అనేక టీ.వీ కార్యక్రమాల ద్వారా, రేడియో కార్యక్రమాల ద్వారా, రచనల ద్వారా కూడా మానసిక రుగ్మతల పై ప్రజలకు అవగాహన కల్పించడంలో సఫలీకృతులయ్యారు. ఎన్నో వేల మందికి తన మనోవైద్యం ద్వారా అనేక మానసిక రుగ్మతలను బాగుపరచియున్నారు. వాటిలో కొన్నిటిని సేకరించి కథల రూపంలొ జనజీవనులకు అందించే ప్రయత్నమే ఈ మనసు తలుపు తెరిస్తే...
