-
-
శర్మ కాలక్షేపం కబుర్లు - గఱికెల మాన్యం
Sarma Kalakshepam Kaburlu Garikela Manyam
Author: Chirravuri Bhaskara Sarma
Publisher: Self Published on Kinige
Pages: 323Language: Telugu
వేదాలను, కావ్యాలను, ఇతిహాసాలను ఔపాసన పట్టి లోకజ్ఞానం సముపార్జించిన యోగి కూడా జ్ఞానాన్ని శిష్యుల రూపంలో పరంపరగా అందించి లోకం నుండి నిష్కమించినట్లే శతాయుషు చేరుకొని జీవితాన్ని విస్తారంగా చవిచూచిన వృద్ధులైననూ జ్ఞాన ఛాయలు వొదిలి వెళ్లాల్సి వుంది. ఆ జ్ఞానఛాయలు భావితరాలకు చుక్కానిలా దారి చూపుతుంటాయి. మన సంస్కృతిలోనే వొక నిరంతర ధార వుంది. అది పెద్దలమాట చద్దిమూట లాంటిది. అలాంటి మంచి పనిని శర్మ గారు గఱికెల మాన్యం రూపంలో చేస్తున్నందుకు సంతోషంగా వుంది.
మనుషులు ఏళ్ళు గడిచే కొద్దీ తోటి మనుషులకు దూరంగా స్వంత కాలక్షేపానికి దగ్గరగా లేకపోతే ఏకాంతంగా వొక యోగిలా జీవించడం నేర్చుకోవాలి. ఇతరులనుండి ఏమీ ఆశించకుండా వాళ్ళ ప్రవర్తన వలన క్షణ కాలమైనా మనసు కలుక్కుమనకుండా ఇతరులు మనని అర్ధం చేసుకోవడంలేదు అని అనుకోకుండా వాళ్లనే మనము అర్ధం చేసుకుంటూ వీలైనంత దూరంగా జరుగుతూ అంతర్ముఖులై జీవించడం ప్రకృతికి దగ్గరగా జీవించడం ఉత్తమం. శర్మ గారి జీవన విధానం చూస్తే నాకలాగే అనిపించింది. అలాంటి ఉత్తమమైన జీవన విధానంతో జీవిస్తూ వారి అనుభవాలను జ్ఞాపకాలను మనందరికీ చెప్పిన బ్లాగ్ కాలక్షేపం కబుర్లు ఈ-బుక్‌గా రావడం సంతోషకరం.
ఒక పుస్తకం చదివినా ఒక ప్రసంగం విన్నా ఒక సినిమా చూసినా మనకేమి కావాలో అదే తీసుకుంటాం. ఈ పుస్తకం మొత్తాన్ని తీసుకోగల్గడం ఒక భాగంగా భావించాలి మనమందరం. ఎన్నెనో తెలుగు పదాలు, ఏది సంస్కృతమో, ఏది తెలుగు పదమో వివరించే క్రమాలు ఆ నుండి ఱ వరకూ, సామెతలు, ఛలోక్తులు, నానుడి అన్నీ మిళితమై ఉంటాయి. కథలు మళ్ళీ అందులో ఉప కథలు అనుభవాలు. గారెలకు చిల్లు యెందుకు, తోడికోడళ్ళు దెప్పుకున్నట్లు నాయకులు చెప్పుకోవడాలు, ప్రపంచ రాజకీయాలు, సమకాలీన సమస్యలు, ఆసక్తికరమైన విషయాలు అన్నీ ఉంటాయి.. సూక్ష్మంగా సలహాలు కూడా లభిస్తాయి. చదువుతుంటే కాలం తెలియదు. చదివి కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు మన అనుభవంలో మనకి తెలుస్తూంటుంది అంతే.
- వనజ తాతినేని
గమనిక: " శర్మ కాలక్షేపం కబుర్లు - గఱికెల మాన్యం " ఈబుక్ సైజు 6.6mb

- ₹43.2
- ₹43.2
- ₹43.2
- ₹43.2
- ₹43.2
- ₹43.2