-
-
శర్మ కాలక్షేపం కబుర్లు - ఆయ్! మాది ప.గో.జి అండి!
Sarma Kalakshepam Kaburlu Aai Maadi Pagoji Andi
Author: Chirravuri Bhaskara Sarma
Publisher: Self Published on Kinige
Pages: 221Language: Telugu
జీవిత సారాన్ని కాచి వడబోసిన వారు శ్రీకష్టేఫలి శర్మగారు. వారి టపాలలో అన్నిటిలోనూ అది ఖచ్చితంగా అంతర్లీనంగా కనిపించి చదువరులను అలరింప చేస్తుంది.
జాతీయాలు నుడికారాలు సామెతలు వావ్ అనిపించేలా నేటి సమాజానికి ప్రతీకలా వారి వ్యాసాలలో తళుక్కుమని మెరిసి చీర్స్ అంటూ ఆటలాడేసుకుంటాయి.
నాటి టెలిఫోను టెక్నాలజీ నుండి నేటి ఐపీ కూపీలను లాగేంత దాకా వారికి కరతలామలకము.
టెలిఫోనెక్స్చేంజీ కతలు, భార్యాభర్తల మధ్య అనురాగపు తేటగీతులు, పిల్లల పెంపకం, ధారణాశక్తితో చిన్న నాటి కాలపు విషయాలను తేదీ వారాలతో సహా చెప్పి అందరినీ అలరింపచేయడం, ఏదన్నా తెలియనిది అడిగితే వాటి గురించి విశదీకరించి చెప్పడం, నాటి భారత రామాయణాలను నేటి కాలానికి అనుగుణంగా అన్వయించి చెప్పడం, పెండ్లికబుర్లు, పేరంటాల కబుర్లు, గోదావరి తరపు గాధలు, పరులకై వారి నాన్న గారి వైద్యం వాటి కమామీషు (వాటి పై జిలేబి కతలు), నేటి రాజకీయాలపై అబ్బే నాకు తెలియదండీ అంటూ వ్యంగ్యాస్త్రాలను సంధించడం, పగోజి, తూగోజి మధ్య వారసత్వం పుచ్చుకున్న వారి వైనం, సిగెరెట్టోపాఖ్యానాలు, నౌకరిలో పదోన్నతులు, తోడుగా పనిచేసిన వారికి అందించిన సాయాలు, అనాతవరపు కతలు, గుళ్ళూ, దేవాలయాల దర్శనాలు, సత్తిబాబుతో లోకాభిరామాయణం, వాటితో పాటు నా దేశం ఏమైపోతోందో అన్న బెంగపాటు, సోలార్ ప్యానెల్ వెనర్లూ, తెల్లారి పూట కరెంటు లేక పోతే పడ్డ బాధలు, ఎండకు వేడెక్కి గదిలోనే వుండి టపాలను రాయలేని రోజులు, ఇలా నే చెప్పుకుంటూ పోవచ్చు, కాని వారి వ్యాసపరంపరల విస్తీర్ణత ఇదీ అని కొలబద్దకందనిది. ఇదే సత్యం.
- జిలేబి

- ₹43.2
- ₹43.2
- ₹43.2
- ₹43.2
- ₹43.2
- ₹43.2