-
-
సాహితీసమరాంగణ సార్వభౌమ
Saahithi Samaraangana Saarwabhowma
Author: Ravi Krishna Modugula
Publisher: Mitramandali Prachuranalu
Pages: 240Language: Telugu
శ్రీకృష్ణదేవరాయలు, ఆయన కాలంలో వెలసిన సాహిత్యం గురించి ప్రముఖులు వ్రాసిన వ్యాసాలు, 102 ఛాయాచిత్రాలతో కృష్ణదేవరాయలకు అక్షరరూప నివాళి ఇది.
- మిత్రమండలి ప్రచురణలు
* * *
కృష్ణరాయల గురించి నవలల, కథల రూపంలో ఎంతో సాహిత్యం వచ్చింది. కల్పనాత్మక సాహిత్యమేకాక చారిత్రక గ్రంథాలు అనేకం వెలువడ్డాయి.
ఈ వ్యాస సంకలనం నాలుగు భాగాలు. మొదటి భాగం కృష్ణరాయల ప్రశస్తి. రెండవ భాగం కృష్ణరాయల కాలంనాటి లలిత కళలు. మూడవ భాగం రాయల కాలంనాటి సాహిత్యం. నాల్గవ భాగం హంపీ గురించి. హంపీ నా దృష్టిలో చారిత్రక ప్రదేశం మాత్రమే కాదు. భారతదేశ చరిత్ర గురించి ఏమాత్రం అభిమానం ఉన్నా కుటుంబంతో ఒకసారైనా దర్శించవలసిన పుణ్యక్షేత్రం. తిరిగి తిరిగి రాయి రాయి తాకి తరించవలసిన మహిమోపేత స్థలం.
- రవికృష్ణ
* * *
“శ్రీకృష్ణ దేవరాయలను గురించి దేశ విదేశ విద్వాంసులు ప్రకటించినంత మంచి అభిప్రాయాలు ప్రపంచంలో మరే చక్రవర్తిని గురించీ ప్రకటించలేదు. ఇది మనకు గర్వకారణం. ఇటు కటకం నుండి అటు గోవా వరకు, గోవా నుండి కన్యా కుమారి వరకు కృష్ణరాయల విషయాలు ఎన్నో లభిస్తున్నాయి. వాటిని సేకరిస్తే గాని రాయల చరిత్ర, ఆంధ్రదేశ చరిత్ర సమగ్రం కాదు. తెలుగు భాష కోసమే ఆంధ్రప్రదేశ్ అవతరించడం నిజమైతే కృష్ణరాయల చరిత్ర పరిశోధన కోసమే ఒక శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏర్పడాలి.”
- కె.ఎస్.కోదండరామయ్య
గమనిక: "సాహితీసమరాంగణ సార్వభౌమ" ఈబుక్ సైజ్ 27 MB
- ₹194.4
- ₹216
- ₹86.4
- ₹108
- ₹162
- ₹140.4
yes friends this is messagge is charrect