-
-
ఆత్మ కధాంశాల ఉత్తరాలు
Atma Kadhamsala Uttaralu
Author: Ranganayakamma
Publisher: Sweet Home Publications
Pages: 168Language: Telugu
కొంతమంది పాఠకులు నన్ను, “ఆత్మకథ రాయండి. ఆత్మకధ రాయండి” అంటారు. ఉద్యమకారులైతే, ఆ విశేషాలతో, ఆ అనుభవాలతో రాస్తారు. రాయాలి. నాకు అంత విశేషాలేముంటాయి? ఐదో పదో కథలు రాసినంత మాత్రాన ఆత్మ కథలు రాసెయ్యడమేనా? - ఇప్పుడా పాత ఉత్తరాలు చదివితే, అవన్నీ, పాత సంగతులు కొన్ని చేర్చి ఆ ఉత్తరాల్ని చిన్న పుస్తకంగా ఇస్తే? - అదీ ఆలోచన. ఈ ఆలోచన కొన్నాళ్ళు సాగి సాగి గట్టిపడింది.
చీమూ నెత్తురూ లేనట్టు బతికే ఆడ వాళ్ళని చీదరించుకుంటూ, నా గురించి నేను గొప్పలు చెప్పుకుంటానుగానీ, నన్ను ఎప్పుడూ ఒక ప్రశ్న వేధిస్తూ ఉంటుంది. పదేళ్ళు నరకంలో ఎందుకు కొట్టుకున్నాను? కానీ అంత జ్ఞానం ఎక్కడ ఉంది అప్పుడు? ఏం నేర్పారు చిన్నప్పట్నించీ మా వాళ్ళూ, బంధువులూ, బళ్ళో పాఠాలూ, సినిమాలూ, మొత్తం లోకం అంతా? కానీ, అన్నీ ఎవరో నేర్పాలా? నా స్వంత జ్ఞానం ఏమైంది? నా బుద్ధీ, నా సిగ్గూ, ఏమయ్యాయి? అంత బుద్ధి ఏడిసిందా నాకు అప్పుడు? - అంటే, నేనూ అందరు ఆడ మూర్ఖుల లాంటి దాన్నే అప్పుడు. అజ్ఞానం, చేతగానితనం, బుద్ధిలేనితనం, ఆ తనాలెన్నో ఉన్న దాన్నే అప్పుడు. నన్ను నేను తిట్టుకుంటాను గానీ, అప్పుడు నిజంగా నాకు దారి లేదు.
ఎప్పటికో వచ్చింది తెగింపు. ఆతర్వాత జరిగిన విషయాలన్నీ నా ఉత్తరాల్లో ఉన్నాయి. అవసరమైన చోట్ల ఫుట్ నోట్లు కూడా రాశాను.
కృష్ణాబాయి గారికి బద్దకం. వచ్చిన ఉత్తరం వచ్చినట్లు చదివి చింపెయ్యని కృష్ణబాయి గారి బద్దకాన్ని అభినందిస్తూ, పోనీ ఒక సారి వుత్తరాలు చదివి చూడండి!
