• Gelupante Vijayaniki Edu Sutralu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 80
    100
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గెలుపంటే... విజయానికి ఏడు సూత్రాలు

    Gelupante Vijayaniki Edu Sutralu

    Author:

    Publisher: Rupa Prachuranalu

    Pages: 129
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ఎవరి కోసం ఈ పుస్తకం....
ఎవరికోసం? జీవితంలో గెలవాలనుకునే ప్రతి యువకుని కోసం - చదువుకుంటున్న ప్రతి విద్యార్థి కోసం - చదువు మధ్యలో ఆపేసిన కుర్రాళ్ల కోసం - చదువు పూర్తి చేసుకొని ఉద్యోగవేటలో ఉన్న ఆశావాదుల కోసం - ఏ ఉద్యోగం లభించడం లేదనే నిరాశలో ఉన్న నిరుద్యోగుల కోసం - అమ్మా నాన్నలకు ఆస్తిపాస్తుల్లేని కుటుంబాల్లోని యువకుల కోసం - ఆస్తిని కాక స్వశక్తిని నమ్ముకున్న సుపుత్రుల కోసం - సినిమాలు, షికార్లు, స్నేహితులతో కుషీగా కాలం గడిపేస్తూ కూడా అంతరాంతరాల్లో, జీవితంలో ఏదైనా సాధించాలనే కసి ఉన్న యంగ్‌స్టర్ కోసం - “లవ్" లో గెలిచి జీవితంలో కూడా గెలవాలనుకునే ప్రేమికుల కోసం - లవ్‌లో ఓడి జీవితంలో నైనా గెలవాలనుకునే యువత కోసం - భవిష్యత్తును నిర్మించుకోవాలనుకునే వారి కోసం - జీవితాన్ని పునర్నిర్మించుకునే వారి కోసం...... ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అక్షర జ్ఞానమున్న ప్రతి యువకుడి కోసం... ప్రతి యువతి కోసం....

ఓటమి, అవమానం, తిరస్కారం ఇవి ఖరీదైన చాక్లెట్‌పైన గట్టిగా చుట్టిన రేపర్ లాంటివి. ఓపికగా వాటిని ప్రక్కకు తొలగిస్తే లోపల గెలుపు చాక్లెట్ తీయగా పలుకరిస్తుంది. మనసును పరవశింప చేస్తుంది కూడా...

- పబ్లిషర్స్

Preview download free pdf of this Telugu book is available at Gelupante Vijayaniki Edu Sutralu
Comment(s) ...

నాకు తెలిసి జాలాది రత్న సుధీర్ గారు ప్రముఖ కవి, రచయిత. అతను మొదటిసారి 'సెల్ఫ్ హెల్ప్' మీద 'విజయానికి ఏడు సూత్రాలు' పుస్తకం రాయడం, అందులోను ప్రపంచాన్ని ఏలుతున్న ధనవంతులు ఎలా ఆ స్థాయికి ఎదిగారో వివరిస్తూ వ్యాసాలు రాయడం చాలా మంచి ప్రయత్నం. లోగడ ఇతను - యువకులు ఎలా విజయం సాధించాలో వివరిస్తూ 'టిప్స్' ఇస్తూ 'ఇంస్ట్రా గ్రామ్' లో పలు ప్రసంగాలు చేశారు. ఆ వీడియోలు వైరల్ గా మారి వేలాది యువకుకు అతనికి ఫాన్స్ గా మారారు. చాలామంది ఆయన ప్రసంగాలను రికార్డ్ చేసుకుని - వాటిని ఆచరించి విజయం సాధిస్తున్నారు. ఈమధ్య ఐ. ఏ. ఎస్ కు సెలెక్ట్ అయిన ఓ అబ్బాయి తనకు జాలాది రత్న సుధీర్ ప్రసంగాలు ప్రేరణ అని చెప్పాడు. ఆయన చెప్పిన విజయానికి ఏడు సూత్రాల లోంచి కేవలం రెండింటిని మాత్రమే ఆచరించాను - మరో ఐదు పాటించి ఉంటే ఇండియన్ ఫారిన్ సర్వీస్ కు సెలెక్ట్ అయ్యేవాడిని అన్నాడు. ఇలాంటి ప్రేరణనాత్మక పుస్తకాలను యువకులు కచ్చితంగా చదవాలని నేను ప్రగాడంగా నమ్ముతున్నాను.
- మోహనరావు దురికి (రచయిత, దర్శకుడు)