• Kundena - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • కుందెన (free)

    Kundena - free

    Pages: 120
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“ఇది సాహిత్య విమర్శ పుస్తకం. నా విద్యార్థుల్ల ఎక్కువ మంది కవులు. సత్తయ్య, విమర్శ మార్గాన్నెంచుకున్నడు. విమర్శకుల కొరత శాన ఉంది. ఆ మార్గంల వెలుగు కావడం మంచిదేగద. విమర్శకుడికి ఒక ఐఏఎస్ కంటే, ఒక ముఖ్యమంత్రి కంటే, ఒక ప్రధానమంత్రి కంటే ఎక్కువ జ్ఞానం ఉండాలె. ఈ లక్షణాలను సత్తయ్య క్రమక్రమంగా సంతరించుకుంటున్నాడనడానికి ఈ పుస్తకంలోని కొన్ని వ్యాసాలు నిదర్శనంగా నిలుస్తున్నవి."

- డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి

“ఇప్పుడు సాగర్ల సత్తయ్య 'కుందెన' పేరిట 35 విభిన్నమైన విమర్శా వ్యాసాలను మన ముందుకు తెస్తున్నారు. భవిష్యత్తులో మంచి విమర్శకుడిగా ఎదగడానికి పటిష్టమైన పునాదులు ఈ పుస్తకం ద్వారా పడ్డాయంటే అతిశయోక్తి కాదు. ఎనుకట మిల్లులు లేని , కాలంలో ధాన్యాలను దంచేప్పుడు అవి చిల్లం కల్లం కాకుండా కాపాడుకునేందుకు 'రోలు’ పై 'కుందెన' ఉంచేవారు. సాహిత్యంలో కూడా సత్తయ్య తాలుని ఏరేసి సత్తువ ఉన్న ఇత్తుల్ని జల్లెడబట్టి మనకందించిండు. ఏ 'రోటి’కాడి పాట ఆ 'రోటి' కాడ పాడే వాళ్ళు చాలా మంది ఉన్నరు. అది విమర్శకన్నా పరామర్శగానే ప్రసిద్ధి. అందుకు విరుద్ధంగా సత్తయ్య ఇందులోని రచనలన్నింటినీ సమదృష్టితో పరిశీలించి, విశ్లేషించి, వ్యాఖ్యానించారు. రాళ్ళు తాలుతో కూడిన వాటిని చెరిగి మనకందించిండు."

- సంగిశెట్టి శ్రీనివాస్

“ఏ వ్యాసానికైనా లోతైన పరిశీలన, వివేకవంతమైన విశ్లేషణ, సహజ సుందరమైన భాష, ధారాశుద్ధి వన్నెతెస్తాయి. సాగర్ల సత్తయ్య వ్యాసాల్లో ఈ నాలుగు లక్షణాలకు తోడు ‘సహృదయత' అనే పంచమ లక్షణం చేరి సనార్ద్రతనద్దినాయి. వ్యాసాల నిండా ఆత్మీయాభిమానం పరచుకుని, పఠితలను అతనికి, అతని సాహిత్యానికి అభిమానులుగా మారుస్తాయి."

- దోరవేటి

“ఒక అంశానికే కట్టుబడి ఉన్న రచనలు కాకుండా, వస్తువైవిధ్యం ఉన్న రచనలను తన విమర్శకు వస్తువులుగా తీసుకోవడం సత్తయ్యలోని ప్రత్యేకత. తమ వ్యాసాలు ద్వారా విస్మృత సాహిత్యకారులను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేయాలనుకునే వారికి సత్తయ్య 'కుందెన' ఒక దిక్సూచిలాంటిది."

- రాపోలు సీతారామారాజు