-
-
కర్మ
Karma
Author: Suryadevara Rammohana Rao
Pages: 431Language: Telugu
అంతవరకు జరిగింది చెప్పి అపాడు యతీంద్ర.
వింటున్న తాంతియా ధూమ్రెకి ఇది చాలా ఆసక్తి కలిగిస్తోంది. ఇది ఫ్యామిలీ స్టోరీ నాకెందుకులేని అంతవరకు దూరంగా కూచున్న గైడు భీక్యా కూడా ఇప్పుడు తిన్నె వంచన కూచుని కుతూహలంగా వింటున్నాడు. తాంతియా ధూమ్రెకి కలిగిన డౌటే భీక్యాకీ కలిగింది. వెంటనే అడిగాడు.
“మీరు చెప్పింది బాగానే వుంది సాబ్. చివరికి లవ్ జంట ఒక్కటయింది. ఇరువైపులా పెద్దలు అంగీకరించి ఆ జంటకి పెళ్ళి కూడ జరిగిపోయి ఉంటుంది. ఇంకా ఎందుకు సాబ్ ఆ అమ్మాయంటే మీకింత ద్వేషం, పగ? విషకన్యగా మార్చేయాలన్నంతగా కోపం కసి అవసర మంటారా?” అంటూ.
తాంతియా ధూమ్రె కూడ 'అవును కదా?' అన్నట్టు చూసాడు.
“లేదు భీక్యా. వాళ్ళింకా పెళ్ళి చేసుకోలేదు” అన్నాడు గంభీరంగా యతీంద్ర.
“ఏమైంది?" అడిగాడు తాంతియా ధూమ్రె.
“ఏం కాలేదు. ఇంకో రెండేళ్ళు ఆగితే తను డాక్టరవుతాడు. చదువు పూర్తవుతుంది. ఆ తర్వాతే పెళ్ళంటూ మెలికపెట్టాడు సత్కర్మ. అప్పుడే ఏమైంది. అసలు కథ ఇక్కడే ఉంది”
“అసలు కథా...? అంటే... తర్వాత ఏం జరిగింది? అనడిగాడు తాంతియా ధూమ్రె.
“మా నాన్నడిగితే కాదన్నారు. నేనడిగితే అవమానించి నడిరోడ్డులో దించి పోయింది మానస. సొంత బావని ఛీ పొమ్మంది. ఎవడ్నో ప్రేమించింది. పెళ్ళి చేసుకుంటే ఆశీర్వదించి అక్షింతలు వేయగలనా? అందమైన అమ్మాయితోబాటు వేలకోట్ల ఆస్థి. అదృష్టం ఎవడ్నో వరిస్తే తట్టుకోగలనా? పైకి నవ్వుతూ మామూలుగా తిరుగుతున్నాను గాని నా గుండెల్లో అవమాన అగ్నిజ్వాలలు భగభగ మండుతూనే వున్నాయి. నాదనుకున్నది నాకు దక్కలేదంటే నాది పగ... పాము పగ. కాటేయకుండా వదలను. మానస నాకే దక్కాలి. అప్పుడే ఆస్తి కూడ నాదవుతుంది. ఏం చేస్తే పనవుతుంది? నిరంతరం ఇదే ఆలోచన. ఎంత తాగినా కిక్ ఇవ్వనంత పిచ్చి. నా కోరిక తీరాలంటే చివరికి ఒకే దారి కన్పించింది. మానసను బలాత్కరించాలి. తన కన్నెరికాన్ని దోచుకోవాలి. అప్పుడు చచ్చినట్టు నా చేత తాళి కట్టించుకొంటుంది. ఆ తర్వాత పగ చల్లారేలా దాన్ని రాచి రంపాన పెట్టి రంజుగా ప్రతీకారం తీర్చుకోవచ్చు. దాని కళ్ళ నుంచి జారే ప్రతీ కన్నీటి బొట్టులోను ఆనందాన్ని వెతుక్కోవచ్చు.
కాని... కాని అదంత సులువు కాదు. సరైన సమయం చూసి దెబ్బ కొట్టాలి. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఈలోపల హైదరాబాద్ నుంచి సత్కర్మ మానస కోసం లింగాలపాడు అగ్రహారం తరచూ వచ్చి పోతూనే వున్నాడు. వాళ్ళిద్దరూ జాలీగా తిరుగుతూనే వున్నారు. వాళ్ళను చూసి నా గుండెలు మండిపోయేవి. ఇలా ఉండగా నేను ఎదురుచూసిన అవకాశం రానే వచ్చింది. అదీ పెను తుఫాను రూపంలో వచ్చింది" అంటూ జరిగింది వివరించసాగాడు యతీంద్ర.
Usual stuff of Suryasevara