• Durmargudu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దుర్మార్గుడు

    Durmargudu

    Author:

    Pages: 350
    Language: Telugu
    Rating
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

“మనం వచ్చింది దేనికి? ఇక్కడ చూస్తున్నది ఏమిటి?” షాడోని అడిగాడు గంగారాం.
మికీ ఆఫీసుగది ముందు సినిమా టిక్కెట్ల కోసం క్యూలో నిలబడినట్లు నిలబడి ఉన్నారు హాస్పిటల్‌లో ఉన్న పేషెంట్స్, వారి బంధువులు అందరూ.
లోపల ఉన్న పిచ్చిసన్యాసి ఒక్కసారైనా తమ వంక చూస్తే చాలునన్న తమకం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది వారి కళ్ళల్లో.
“ఆలస్యం చేస్తే ఈ వీధి చుట్టుపట్ల ఉన్నవారు కూడా వచ్చి లైనులో నిలబడతారు. వచ్చిన పనేమిటో చెప్పు గురూ....” మరోసారి రిక్వెస్ట్ చేశాడు గంగారాం.
“నిన్ను ఎవడ్రా డ్రామా వేషం వేయమన్నాడు?" అడిగాడు షాడో.
“ఆ సమయంలో అలా చేయటంకంటే మంచి మార్గం మరొకటి లేదని అనిపించింది....” అంటూ ఉన్నట్లుండి కుర్చీలోనుంచి లేచాడు గంగారాం.
అతనికంటే వేగంగా కదిలాడు షాడో. అదిరిపడి తలా ఒక పక్కకు పరుగులు తీశారు గదిముందు వరుసగా నిలబడి ఉన్న జనం.
సూటిగా, స్ట్రెయిట్‌గా ముందుకు వెళ్ళిపోయాడు షాడో. మూడో కారిడార్ దగ్గరికి పోగానే అమాంతం గాలిలోకి ఎగిరాడు.
బరువైన సమ్మెటతో బాదినట్లు పగుళ్ళు చూపింది అతని కుడిపాదం తగిలిన కారిడార్ గోడ. రెండు జానల పొడవున్న చాకును వదిలేసి, మెడను తడుముకుంటూ ముందుకు పడిపోయాడు కాషాయాంబరాలు ధరించి ఉన్న ఒక దృఢకాయుడు.

Preview download free pdf of this Telugu book is available at Durmargudu