-
-
6 జానపద నవలలు
Aru Janapada Navalalu
Author: Sreesudhamayi
Publisher: Manrobo Publications
Pages: 507Language: Telugu
"జానపద నవలలకు ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు" అనడానికి ఉదాహరణ కినిగెలో జానపద నవలల ప్రభంజనం.
మేన్ రోబో పబ్లికేషన్స్ ద్వారా విడుదలైన శ్రీసుధామయి జానపద నవలలు దాదాపు ప్రతీవారం టాప్టెన్లో ఉంటూనే వున్నాయి.
విడివిడిగా కాకుండా ఒకే పుస్తకంలో ఆరు జానపద నవలలు కేవలం నాలుగు నవలల వెలకే అందిస్తున్నాం.
ఈ ఆరు నవలల మీద మీ కామెంట్స్ పంపించవచ్చు.
పులి మీద దర్జాగా కూచుని పులిని స్వారీ చేస్తున్నట్టు వుంది రాయంచ చిలుక...
"నేను మీకు మిత్రుడిని" చెప్పింది పులి...ఒక పిల్లవాడు పులితో ఆడుకున్నాడు. అందరితో కరచాలనఁ చేసింది పులి.
మంత్రాలదీవిలో అదృశ్యవనంలో ఆయుధాలు అంతర్థానమైపోతున్నాయి....గరుడపక్షి సర్పముఖిని తన నోటకర్చుకుని గాలిలోకి ఎగిరింది.
జ్వాలాముఖి...మంత్రాలదీవి.
అది భూతాలదీవి. భూతాలు ఆ దీవిని అదృశ్యరూపంలో కాపలా కాస్తున్నాయి. భూతాలదీవిలోకి అడుగుపెట్టే సాహసం చేసినవారు ఎవ్వరూ ప్రాణాలతో మిగల్లేదు. అతిశక్తివంతమైన ఆ దీవిలోకి అన్యులెవరైనా ప్రవేశించగానే విచిత్రరూపంలోకి మారిపోతారు. తమ రూపాన్ని కోల్పోతారు.
భూతాలదీవి...భేతాళ మాంత్రికుడు.
అన్యులెవరూ ప్రవేశించలేని మాయామంత్రాలతో దుర్భేద్యమైన మణిద్వీప పాలకుడు క్షుద్రమాంత్రికుడు వివర్ణుడి మణిద్వీపంలోకి ప్రవేశించడానికి సిద్ధమయ్యాడు విజయవర్ధనుడు
* ఆరడుగుల కాలసర్పం కాటు నుంచి విజయవర్ధనుడిని రక్షించింది కుందేలుపిల్ల. కుందేలుకు మాట్లాడే వరాన్ని ఇచ్చింది నాగకన్య.
మణిద్వీప రహస్యం ఏమిటి ?
మణిద్వీప రహస్యం.
రాకుమారుడు విజయవర్మకు తోడుగా వున్న మానవభాషలో మాట్లాడిన తుమ్మెద చేసిన సాహసం ఏమిటి?
పచ్చలలోయలోకి వెళ్లిన వారు ఎలా అదృశ్యమై ... ఏమైపోతున్నారు ?
పచ్చల లోయ.. పాతాళసుందరి.
ఒక్కసారిగా ప్రకృతి విలయతాండవం... దట్టంగా అలుముకున్న మేఘాలు.. కుంభవృష్టి.
ఆ మెరుపుల్లో పర్వతప్రాంతంలో భూమిలోపల చిన్న కదలిక. భూమి కంపిస్తుంది. రెండుగా చీలుతుందా అన్నంత భయానక వాతావరణంలో భూమి పొరలను చీల్చుకుని మా...యా...ద...ర్ప...ణం బయల్పడింది.
మహాతలం... మాయాదర్పణం.
"మాయాక్షా అక్కడే ఆగిపో. నీ మంత్రశక్తి కానీ ఎలాంటి మాయలు కానీ ఆ కమండలాన్ని దక్కించుకోలేవు. ఎలాంటి దుష్ట శక్తులు కూడా మణికందరుడి మహిమాన్వితమైన శక్తులను తాకలేవు." హెచ్చరించింది అసురవాణి
మాయాద్వీపం.
మీ ఆదరణే జానపద నవలకు ఊపిరి.
ఆరు జానపద నవలలు మీ అభిమానానికి ఆరోప్రాణం.
గమనిక: "ఆరు జానపద నవలలు" ఈబుక్ సైజు 12.6mb
మంచి ప్రయోగం.ఒకేసారి ఆరుజానపద నవలలు చదివే అవకాశం కలిగింది.ముఖ్యంగా రెంట్ ఆప్షన్ ఇచ్చారు.థాంక్యూ...
ప్రారంభంలోనే ఆకట్టుకునే శైలి.విడవకుండా చదివించే కథనం.
పిల్లలను పెద్దలను చదివించే నవలలు.అభినందనలు
Plz enable rent option
థాంక్యూ కినిగె
అరవై రూపాయల రెంట్ ఆప్షన్ తో ఆరు జానపద నవలలు చదివే అవకాశం ఇచ్చారు.ఒకప్పటి జానపద వైభవాన్ని మళ్ళీ మాకు అందిస్తున్నారు.అన్ని పుస్తకాలు అద్భుతంగా వున్నాయి.ముఖ్యంగా శ్రీసుధామయి గారి శైలి నాటి రాజుల కాలాన్ని కళ్ళముందు నిలిపాయి.
జ్వాలాముఖి నవలలో పులిమీద చిలుక స్వారీ ,మాయాద్వీపంలో మాయక్షుడు, భూమి పొరలను చీల్చుకుని మాయాదర్పణం పైకి రావడం,,అక్షరాల ఇంద్రజాలం.
How to downlode please send me
ఆరు జానపద నవలలు వేటికవే అద్భుత.ఒక్కో నవల,కథాంశం,కథనం అనగనగా కథల ప్రపంచంలోకి తీసుకువెళ్ళింది.
జ్వాలాముఖి...మంత్రాలదీవి.
భూతాలదీవి...భేతాళ మాంత్రికుడు.
మణిద్వీప రహస్యం.
పచ్చల లోయ.. పాతాళసుందరి.
మహాతలం... మాయాదర్పణం.
మాయాద్వీపం.
ఒక్కో నవల చదువుతుంటే చిన్ననాటి ప్యాకెట్ సైజు జానపద నవలలు గుర్తుకువచ్చాయి.మాయలు మంత్రాలూ కత్తియుద్ధాలు సాహసాలు మాంత్రికులు ,ఆరు నవలలను ఒకే పుస్తకంలో తక్కువ వెలలో అందించిన కినిగెకు ధన్యవాదాలు.రచయిత్రికి అభినందనలు.మీరు మరిన్ని జానపద నవలలు రాయాలి.
How downlode this novels pls help me