-
-
నాటి మేటి సినీ ఆణిముత్యాలుతో ముఖా ముఖి ఇంటర్వ్యూలు
Interviews with Veteren Telugu Stars
Author: Pasupuleti Ramarao
Language: Telugu
రచయత స్వంత మాటల్లో
ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఒక కారణముంది. కొంత కాలంగా తెలుగు ఫిలిం జర్నలిజంలోకి ఎందరో యువతీ యువకులు వస్తున్నారు. వాళ్ళంతా గతం గురించి తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకోవడానికి ఆధారాలు లేవు. కనుక ఈనాటి వ్యక్తుల గురించి, చిత్ర రంగంలోని ఈనాటి పరిస్థితుల గురించి తెలుస్తోంది. ఇప్పుడొస్తున్న వాళ్ళంతా గతం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో వుంది. మన చిత్రరంగానికి సంబంధించిన గతమెంతో ఘనమైనది. మొత్తం చలనచిత్ర రంగానికే తలమానికంగా నిలిచిన మార్గదర్శకులు, మహానుభావులు ఎందరో ఉన్నారు. సినిమాకు తొలి మెట్టయిన నాటక రంగం నుంచి సినిమా రంగానికి వచ్చి మన చిత్రరంగాన్ని తేజోవంతం చేసిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఎందరో వున్నారు. వారి ప్రతిభ కారణంగానే తెలుగు చిత్రసీమ పరిపుష్టితమైందనటంలో సందేహం లేదు.
"నాటి మేటి సినీ ఆణిముత్యాలను ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు ఎన్నో రోజులు శ్రమించి పరిశ్రమకు, పాఠకులకు అందిస్తున్న ఈ నేటి మేటి సినీ ఆణిముత్యాలకు ముందుమాట వ్రాయడం నాకెంతో సంతోషంగా ఉంది". -డాక్టర్. దాసరి నారాయణరావు.
"అరుదైన, నిజాయితీపరుడైన సినీజర్నలిస్ట్ పసుపులేటి రామారావు గత మూడున్నర దశాబ్ధాలుగా సృష్టించిన అక్షర సంపదను పుస్తకరూపంలో తీసుకువస్తున్నందుకు అభినందనలు". -కె. చిరంజీవి
"రామారావు వ్రాసిన ప్రతి ఇంటర్వ్యూలోనూ ఏదో ప్రత్యేకత. పరిశ్రమ బాగోగుల గురించి, మన తెలుగు చిత్రాలకున్న మార్కెట్ పరిమితి గురించి, చిత్రాలలోని కథలు, కథనాల గురించి, వ్యక్తుల సాంఘీక బాధ్యతల గురించి ఇలా ఎన్నో ఎన్నెన్నో ఇంటర్వ్యూలు చేసిన పసుపులేటి రామారావు పరిశ్రమకు, పాఠకులకు ప్రీతిపాత్రం కావాలని కోరుకుంటున్నా". -మురళీమోహన్
