-
-
శర్మ కాలక్షేపం కబుర్లు - పీత్వా పీత్వా పునః పీత్వా..
Sarma Kalakshepam Kaburlu Pitva Pitva Punah Pitva
Author: Chirravuri Bhaskara Sarma
Publisher: Self Published on Kinige
Pages: 202Language: Telugu
శర్మగారు 'కష్టే ఫలి' అనే తమ బ్లాగు పేరుతో అనేక వేలమంది అంతర్జాల వీక్షకులకు చిరపరిచితులు! తమ బ్లాగు ప్రారంభం పూర్వాపరాలను ఉత్సాహ భరితంగా తెలియ చేశారు ఒక టపాలో! రచనా వ్యాసంగాన్ని, ఒక మంచి వ్యాపకంగా మలచుకొని, అనుభవ పూర్వకంగా తెలుసుకున్న విషయాలను, జీవిత సత్యాలను, మన తేట తెలుగులో చెప్పారు!
'సనాతన ధర్మం' గురించి, ఆ టపాలో, క్లుప్తంగా వీరు వివరించిన తీరు, పరదేశ ఆచార వ్యవహారాలను, అర్ధం పర్ధం లేకుండా ఆచరిస్తూన్న యువతకు కనువిప్పు! 'ఉభయ భ్రష్టత్వం ఉపరి సన్యాసం' అనే టపాలో కూడా ఈ విషయాన్ని, శ్రీ కృష్ణుని ‘గీతోపదేశం’ ఉటంకిస్తూ విశదీకరించారు.
తమ ఉద్యోగ ప్రస్థానంలోని ఒడుదుడుకులను అధిగమిస్తూ, అంకిత భావంతో తమ విధులు నిర్వహించడం కూడా తమ టపాలలో వివరించారు. ఈ గుణాలు ఇతరులకు కూడా ఆచరణీయం! 'సెలవా ?!' లో ఒకరోజు రాత్రి ఉద్యోగం చేసి మరునాడు పెళ్లి చేసుకుని మూడవ నాడు తిరిగి ఉద్యోగంలో చేరిన ఘనత గల చరిత్ర నాది 'అందుకే ఇల్లాలికి మరీ లోకువ' అని 'నమ్రత' గా తెలియ చేశారు!
‘విల్లు అనే మరణ శాసనం' టపాలో విల్లు రాయడంలోని విధి విధానాలను తెలియ చేసినా, 'జీవిత పాఠం' టపాలో, 'తినగలిగినంతే తినడం కానీ విస్తరిలో వదిలేయకూడదనే' పాఠాన్ని అనుభవ పూర్వకంగా వివరించినా, ‘వేరు కుంపటి' లో కాఫీ పురాణం చెప్పినా, ఇక పీత్వా , పీత్వా పునః పీత్వాలో తమ దాంపత్య సారాన్ని హాస్య చతురత జోడించి చెప్పినా, 'మార్పు చూసిన తరం' లో తరాల అంతరాలు రమ్యంగా వివరించినా, 'భట్టు వారి రావి చెట్టు' లో పర్యావరణం గురించి ఎంత దూర దృష్టి ఉండేదో, పరిశోధనా పూర్వకంగా వివరించినా, ఆహార పదార్ధాలను నిల్వ చేయడం, కల్తీ ని గుర్తించడం గురించి రాసినా, 'అమ్మమ్మా' అనడంలో అర్ధం అద్భుతంగా వివరించినా, మనవరాలిని ఒక టపాలో ఆప్యాయతతో ఆశీర్వదించినా, వత్తిడి తగ్గించుకోవడానికి చిట్కాల గురించి రాసినా, సుఖ దాంపత్య రహస్యాలను 'అమృత లత' లో వివరించినా , వేదాంత సారాన్ని, 'ఊయల' లో డోలకాన్ని నిజ జీవితంతో పోల్చి చెప్పినా, జీవితం 'పరమ పద సోపాన పటం' అని జీవిత సారాన్ని తెలియ చేసినా, శర్మ గారు తనదైన శైలితో, పాఠకుల్లో, ఆ టపాలను పూర్తిగా చదవాలనే ఉత్సుకత రేపుతూ, వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు!
వీరి బ్లాగు టపాలన్నీ కూడా, పుస్తక రూపంలో రావడం, ఒక సంతోషకర పరిణామం! ఈ పుస్తకాన్ని, ఈ మధ్యనే పరమ పదించిన వీరి సతీమణి స్మృత్యర్థం తీసుకురావడం ముదావహం! ఆదర్శ ప్రాయం! ఈ పుస్తకాన్ని కూడా పాఠకులు ఆదరిస్తారనుకోవడంలో సందేహం లేదు!
- డా. సుధాకర్

- ₹43.2
- ₹43.2
- ₹43.2
- ₹43.2
- ₹43.2
- ₹43.2