-
-
భూతాలదీవి.. భేతాళ మాంత్రికుడు
Bhutala Deevi Bhetala Mantrikudu
Author: Sreesudhamayi
Publisher: Manrobo Publications
Pages: 58Language: Telugu
చిన్నప్పుడు ఆసక్తిగా, ఇష్టంగా చదివిన జానపద నవలలు, చందమామ కథలు అల్లావుద్దీన్ అద్భుతదీపం, సింధుబాద్ సాహసయాత్రలు.. ఒకటా రెండా.. ప్రతీ కథలో సాహసం స్ఫూర్తి ఆసక్తి ఉండేవి.
అమ్మ తన ఒళ్ళో కూచోబెట్టుకుని జానపదకథలు, పేదరాశి పెద్దమ్మ కథలు వినిపిస్తూ ఉంటే,..
అలాంటి కథలు నేనూ ఎప్పుడైనా రాయగలనా ? అన్న చిన్ని చిన్ని ఆశ.
సాహసాలు మయమంత్రాలు చిత్రవిచిత్రాలు... కత్తియుద్ధాలు టక్కుటమారా విద్యలు.. చివరికి సత్యమే జయిస్తుంది. సాహసమే జానపదాల చరిత్రలో నిలుస్తుంది. మీ అభిరుచి ఆదరణ అభిమానం సాక్షిగా.
నేను రాసిన నవలలలో భూతాలదీవి – భేతాళ మాంత్రికుడు అయిదవ జానపద నవల. ఇంతకు ముందు నేను రాసిన జానపద నవలలను ఆదరించారు. నా మొదటి జానపద నవల జ్వాలాముఖి.. మంత్రాలదీవి... దాదాపు ఏడెనిమిది వారాలు టాప్ టెన్‌లో నిలిచింది.
ప్రతీ నవల టాప్ టెన్‌లో ఉంటూనే వుంది. జానపద నవలలు ఎప్పుడూ ప్రజాదరణ పొందుతాయని మీ అభిమానమే నిరూపించింది.
భూతాలదీవి – భేతాళ మాంత్రికుడు కూడా అలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
- శ్రీసుధామయి
***
అది భూతాలదీవి. భూతాలు ఆ దీవిని అదృశ్యరూపంలో కాపలా కాస్తున్నాయి. భూతాలదీవిలోకి అడుగుపెట్టే సాహసం చేసినవారు ఎవ్వరూ ప్రాణాలతో మిగల్లేదు. అతిశక్తివంతమైన ఆ దీవిలోకి అన్యులెవరైనా ప్రవేశించగానే విచిత్రరూపంలోకి మారిపోతారు. తమ రూపాన్ని కోల్పోతారు.
భూతాలదీవి చుట్టూ వున్నా కందకంలో అగ్నిశిఖుడు కాపలా కాస్తుంటాడు. కందకాన్ని దాటే ప్రయత్నం చేస్తే అగ్నిశిఖలు ఆకాశాన్ని అంటుతాయి. కందకాన్ని దాటేవారిని భస్మీపటలం చేస్తాయి.
***
అది దట్టమైన కీకారణ్యం. మానవమాత్రులెవరూ ప్రవేశించలేని దుర్భేధ్యమైన దట్టమైన ఆ కీకారణ్యంలోకి "భేతాళ మాంత్రికుడు" అడుగు పెట్టాడు. భేతాళ మాంత్రికుడు అడుగులు వేస్తుంటే భూమి భూకంపం వచ్చినట్టు దద్దరిల్లిపోసాగింది. చేతిలో ఉన్న పొడవాటి మంత్రదండాన్ని నేలపై తాటిస్తుంటే ఆకాశం ఉరిమినట్టు మేఘాలు గర్జించినట్టు శబ్దం వస్తోంది.
***
భూతాలదీవిని వశం చేసుకోవద్దని భేతాళమాంత్రికుడు క్షుద్రోపాసన మొదలుపెట్టాడు. భూతాల దీవిలోకి ప్రవేశించాడు యువరాజు విజయశీలుడు
మాయలు మంత్రాలు విచిత్రాలు వూహకందని అద్భుతాలు ...
పాఠకులను జానపద ప్రపంచంలోకి తీసుకువెళ్ళే
శ్రీసుధామయి..
భూతాలదీవి...భేతాళ మాంత్రికుడు
మేన్ రోబో పబ్లికేషన్స్ ప్రతిష్టాత్మక ప్రచురణ
జానపద నవలలకు మళ్ళీ ప్రాణం పోస్తున్నారు మమ్మల్ని టైం మిషన్ లోకి తీసుకువెళ్తున్నారు.నాకు బాగా నచ్చిన నవలల్లో మరో మంచి నవల.మళ్ళీ చందమామ పుస్తకాలలో ని కథలు చదువుతున్నట్టు,రాజులకాలంలోకి భూతాలదీవికి వెళ్ళినట్టు వుంది.ఇలాంటి మంచి నవలలు ప్రచురిస్తున్న మేన్ రోబో పబ్లికేషన్స్ కు ,కినిగెకు న్యవాదాలు
the best folklore novel...very interesting and good narration ..
భూతాలదీవి..బేతాళ మాంత్రికుడు ...పట్టువిడవ కుండా చదివించే నవల,శ్రీసుధామయి నవలల్లోని చదివించే లక్షణం మిక్కిలిగా వుంది.మీ కలం నుంచి మరిన్ని జానపదనవలలు డిటెక్టివ్ సిద్దార్థ లాంటి నవలలు రావాలని కోరుకుంటున్నాం..
Awesome story.... Keep it up sri sudha mai garu
శ్రీసుధామయి గారు మీ జానపద నవలలు అన్నీ బావుంటాయి.చక్కని శైలి.చ్చిన్నప్పటి విఠలాచార్య సినిమాలు గుర్తుకు వస్తున్నాయి.ప్యాకెట్ సైజు పుస్తకాలు చదివే అలవాటు.ఇపుడు అలాంటి నవలలు రాసేవారు తక్కువే.భిట్లాడేవి బేతాళ మాంత్రికుడు నవల చాలా బావుంది.అభినందనలు .మీరు ఇలాంటి జానపద నవలలు మరిన్ని రాయాలి.