-
-
ఇలా మిగిలేం
Ila Migilem
Author: Chalasani Prasada Rao
Publisher: Perspectives
Pages: 208Language: Telugu
''కమ్యూనిస్టులంటే నిప్పులాంటి వాళ్లనీ, చెప్పేదానికి మనసా, వాచా, కర్మేణా కట్టుబడి ఉంటారనీ ప్రగాఢంగా నమ్మబట్టే గదా ప్రజలు అంతకుముందు పార్టీని అక్కున చేర్చుకుని, ఆపత్కాలంలో కార్యకర్తల్ని ప్రాణప్రదంగా చూసుకుంటూ కాపాడేరూ, తామూ స్వయంగా కష్టనష్టాల్ని సహించేరూ, దారుణ నిర్బంధాల్ని భరించేరూ! మరి ఆ తర్వాత....? ఆ ప్రజల్ని మనమే విస్మరించినా....లేక వారే మనల్ని విస్మరించనారంభించినాఅందుకు మూలం ఎక్కడుంది?''
''ఎక్కడ మనం ఆగిపోయేం? ఎందుకలా మిగిలిపోయేం....?''
- చలసాని ప్రసాదరావు
అనేక దశాబ్దాల పాటు ఈ దేశంలో అత్యంత పటిష్టమైన నిర్మాణంతో, విరోధులు సైతం మెచ్చుకున్న క్రమశిక్షణతో, ప్రజాహితం తప్ప మరో ధ్యేయంలేని లక్ష్యశుద్ధితో పీడిత ప్రజల ఆశారేఖగా అభివృద్ధి చెందుతూ వచ్చిన కమ్యూనిస్టు పార్టీ - ఆ తరువాతి కాలంలో ఎందుకిలా నీరసించిపోయింది? సిద్ధాంత విభేదాలతోపాటు ఇందుకు కారణమైన క్రమశిక్షణారాహిత్యం, అలక్ష్యం, అలసత్వం, నిర్వ్యాపారత ఎలాంటివి?
బాల్యం నుండి కమ్యూనిస్టు పార్టీ, ప్రజాసంస్థలు, పత్రికలు, ప్రముఖుల మధ్య పెరిగి... రచయిత, చిత్రకారుడు, కళా విమర్శకుడు, పత్రికా సంపాదకుడుగా ఎదిగి, ఎందరికో సుపరిచితుడైన చలసాని ప్రసాదరావు రాజకీయ, సాంస్కృతిక రంగాలలో ఉభయ కమ్యూనిస్ట్పార్టీ (సిపిఐ, సిపిఎం)ల్లోని స్వీయానుభవాలు చెప్పకనే చెపుతున్న కారణాలేమిటి?ఎలా ఉండవలసిన వాళ్ళం ఇన్నేళ్ళ - ఇన్ని పోరాటాల తర్వాత ఇలా... ఎలా మిగిలేం అనే ఆవేదనకు ఒక సమాధానం ఈ అనుభవాల యథాతథం వివరణ. 'అందరం అద్దాలమేడల్లో ఉంటున్నాం? ఎవరి మీద రాయేస్తం' అని ఆత్మన్యూనతకు గురవుతున్న రచయితలను మేల్కొలిపేందుకు చలసాని ప్రసాదరావుగారి ప్రయత్నమే - ఇలా మిగిలేం.
ప్రజలకోసం, ప్రజల మధ్య రాజకీయ సాంస్కృతిక రంగాలలో క్రియాశీలకంగా పనిచేసేవారు ఎంతటి మౌలికమైన విలువలు పాటించాలో...అడుగు జారితే ఎంతటి అధఃపాతాళానికి జారిపోతారో ప్రత్యక్ష్య సాక్ష్యంగా ఇలా మిగిలేం మన కళ్ళముందు ఉంచింది. హరిగారన్నట్లుగా ''చరిత్ర అధ్యయనం చరిత్రను నిర్మించడానికే ఉపయోగపడాలి అని విశ్వసిస్తే, ఈ పుస్తకానికి ఎంతో ప్రాధాన్యం ఉంది.''
- ఆర్ కె
పర్స్పెక్టివ్స్
