-
-
పైసా వసూల్
Paisa Vasul
Author: Vijayarke
Publisher: Manrobo Publications
Pages: 90Language: Telugu
వైభవ్‌కు గాలిలో తేలిపోతున్నట్టుంది. కానీ తాను నిజంగా గాలిలోనే తేలిపోతున్నట్టు అర్థమయ్యేసరి ముచ్చెమటలు మూడు సెంటీమీటర్ల మేరకు బాడీని ఆక్రమించుకున్నాయి.
కారు రోడ్డు మీద దూసుకువెళ్లడం... విమానంలా పరుగులు తీయడం సరే... ...కానీ విమానం టేకాఫ్ తీసుకున్నట్టు పైకి లేవడం ఏమిటి ? వైభవ్ చూస్తూ ఉండగానే కారు బేగంపేట ప్లై ఓవర్ ఎక్కి.. అక్కడి నుంచి ఫ్లై అయ్యింది.. అకాశంలోకి లేచింది. కారులో నుంచి చూస్తుంటే హైదరాబాద్ మినియేచర్ సెట్ లా కనిపించింది.
కారు సరాసరి కుబేరుడి లోకంలో ల్యాండ్ అయ్యింది సేఫ్ గా.
కుబేరుడు చిద్విలాసంగా చూసి "వాట్ అబౌట్ మై వడ్డీ అండ్ అసలు" అని నిలదీసాడు.
* *వెంటనె కృత్తిక "మీ టూ" అంది తనను కూడా ఆశీర్వదించమన్నట్టు కిందికి వంగి
"మీ టూ"అంటే కుబేరుడు అపార్థం చేసుకుని భయపడిపోతారు అన్నాడు లోగొంతుకతో కృత్తికతో
* "మీలోకం కరెన్సీ కాదు..మా ఇండియా కరెన్సీ ...అదీ రద్దైన నోట్లు కాదు.. మోదీ గవర్నమెంట్ కొత్తగా అచ్చుగుద్దిన నోట్లు" చెప్పాడు వైభవ్
* "ఇలా అడుగుతున్నందుకు క్షమించాలి. మీకు బిపి షుగర్ గట్రా ఉన్నాయా? అడిగాడు వైభవ్
" అనగా ..?” అడిగాడు కుబేరుడు
"మా లోకమునందు వుండు మాయరోగములు...జన్యుపరంగా, స్ట్రెస్ పరంగా వచ్చును" అన్నాడు వైభవ్
"మాకు శాపములు తప్ప రోగములు వుండవు.." చెప్పాడు కుబేరుడు
ప్రముఖ రచయిత విజయార్కె
పైసా వసూల్ @ కుబేరాయనమః
మేన్ రోబో పబ్లికేషన్స్ ప్రతిష్టాత్మక ప్రచురణ
ఇంట్రెస్టింగ్
కారు సరాసరి కుబేరుడి లోకంలో ల్యాండ్ అయ్యింది సేఫ్ గా.
హాస్యం
కుబేరుడు చిద్విలాసంగా చూసి "వాట్ అబౌట్ మై వడ్డీ అండ్ అసలు" అని నిలదీసాడు.
సెటైర్
* *వెంటనె కృత్తిక "మీ టూ" అంది తనను కూడా ఆశీర్వదించమన్నట్టు కిందికి వంగి
"మీ టూ"అంటే కుబేరుడు అపార్థం చేసుకుని భయపడిపోతారు అన్నాడు లోగొంతుకతో కృత్తికతో
వావ్
* "మీలోకం కరెన్సీ కాదు..మా ఇండియా కరెన్సీ ...అదీ రద్దైన నోట్లు కాదు.. మోదీ గవర్నమెంట్ కొత్తగా అచ్చుగుద్దిన నోట్లు" చెప్పాడు వైభవ్
హహహ
* "ఇలా అడుగుతున్నందుకు క్షమించాలి. మీకు బిపి షుగర్ గట్రా ఉన్నాయా? అడిగాడు వైభవ్
" అనగా ..?” అడిగాడు కుబేరుడు
"మా లోకమునందు వుండు మాయరోగములు...జన్యుపరంగా, స్ట్రెస్ పరంగా వచ్చును" అన్నాడు వైభవ్
"మాకు శాపములు తప్ప రోగములు వుండవు.." చెప్పాడు కుబేరుడు
చదువుతున్నంతసేపూ నవ్వుకున్నాను ..ఆ తర్వాత నిజమే కదా అనుకున్నాను..ఇలా జరిగితే ఎంత బావుండు కదా..అని శ్రీనివాసుడ్ని కోరుకున్నాను...
జయహో కుబేరాయనమః
పైసా వసూల్ జిందాబాద్
మనసారా హాయిగా నవ్వుకునే ఆహ్లాదకరమైన హాస్యం..ఆలోచింపజేసే కథనం...సన్నివేశాలు...,కొత్తదనానికి సరికొత్త అర్థం చెప్పిన సబ్జెక్టు...నిజంగా కుబేరుడు ఇలా చేస్తే,,,వైభవ్ లాంటి వాళ్ళు ఎందరికో ఇన్స్పిరేషన్ అవుతారు.కృత్తిక పాత్ర బావుంది.
వావ్ ...ఢిఫరెంట్ సబ్జెక్టు ఢిఫరెంట్ అప్రోచ్ ..అద్భుతమైన శైలి...అప్పు తీసుకోమని కుబేరుడు వెంటపడడం...స్వయంగా శ్రీనివాసుడి ప్రామిసరీ నోటు రాయడం.నారదుడు సాక్షిగా ఉండడం..కుబేరాయనమః టీవీ ఛానెల్...కాల్ మనీ కాలనాగుల ప్రస్తావన ,కంటతడి పెట్టిస్తూనే మనసారా నవ్విస్తూ పాఠకులను కొత్తప్రప్రపంచంలోకి తీసుకువెళ్లే ఫాంటసీల మహాద్భుతం.
మా అభిమానరచయిత సృష్టించిన మరో అద్భుతం "పైసా వసూల్ @కుబేరాయనమః "
ది బెస్ట్ ...ఫాంటసీ ...థ్రిల్లర్ ...కామెడీ ...ఎమోషనల్ ...హార్ట్ టచింగ్ .,,చాలా మంచి నవల ..చదివించే నవల . చదువుతున్నంత సేపూ నవ్వించిన నవల .ఆలోచించేలా చేసిన నవల.
రచయితలకు సముచిత స్థానాన్ని కలిగిస్తూ ఈ బుక్ ప్రపంచంలో సరికొత్త సంచలనానికి తెరతీసిన కినిగె ఎనిమిది వసంతాల మజిలీ దాటి తొమ్మిదిలోకి ప్రవేశించింది.
వర్తమాన వర్ధమాన రచయితల రచనల నుంచి , ప్రముఖ సుప్రసిద్ధ రచయితల రచనల వరకూ అందుబాటులోకి తీసుకువచ్చి రచయితలకు సముచిత పారితోషికాన్ని రాయల్టీ రూపంలో చెల్లిస్తున్న కినిగె కు … ఎనిమిది సంవత్సరాల విజయవంతమైన ప్రయాణానికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మేన్ రోబో .
కుబేరుడుడి అప్పు ఇవ్వడం అనే కాన్సెప్ట్ అదుర్స్...కుబేరుడు పైసా వసూల్ ఎలా చేసాడన్నది..ఎలా చేయాలో వైభవ్ చెప్పడం అన్నది..పూచీకత్తుగా శ్రీనివాసుడు సాక్షిగా నారదుడు..స్వామివారి సత్రం..కాల్ మనీ కాళీ వ్యవహారం..హాస్యం ఆర్థ్రత ఆలోచన గ్రేట్ ఫాంటసీ...డిఫరెంట్ థ్రిల్లర్ ...
కృత్తిక పాత్ర చాలా బావుంది.ముఖ్యంగా దేవుడిని నమ్మని వైభవ్ కు దేవుడే పూచీకత్తుదారుడు.ఏడుకొండలవాడ వేంకటరమణా..శ్రీనివాసా..నీ లీలలు అమోఘం .
something different awesome ...ఇలాంటి డిఫరెంట్ కామెడీ థ్రిల్లర్ ఫస్ట్ టైం చదివా ...
ఇలాంటి డిఫెరెంట్ సబ్జెక్టుతో సినిమా తీస్తే ఇంకా బావుంటుంది,ప్లజంట్ గా చదివించే నవల
మనసారా ఆహ్లాదంగా నవ్వుకునే నవల పైసా వసూల్..చాలా కొత్త సబ్జెక్టు...ఇలా జరిగితే బావుండు అనిపించే సబ్జెక్టు.
వైభవ్ కుబేరుడు ఏడుకొండలవాడు శ్రీనివాసుడు ...ముగ్గురు మధ్య సంభాషణ హైలెట్ .
పైసావసూల్ పైసా వసూల్ చేసే నవలే.ఇలాంటి ఫాంటసీ నవలలు పాఠకులను ప్లజంట్ మూడ్ లోకి తీసుకువెళ్తాయి.రచయిత పాత్రలను డిజైన్ చేసిన తీరు బావుంది.విజయార్కె గారి అర్చనలు చిరపరిచితాలే.వారి రచనల్లోని మెరుపు మార్క్ చెదిరిపోదు.కృత్తిక పాత్ర వైభవ్ పాత్ర ద్భుతంగా డిజైన్ చేసారు.కుబేరుడు ప్రజలకు అప్పు ఇవ్వడం.తిరిగి దానిని ఎలా వసూల్ చేసుకున్నాడో చెప్పిన విధానం కళ్ళకు కట్టినట్టు ఇలా జరిగితే బావుండు అన్నట్టు వుంది.
రెండు వారాల క్రితం ఈనాడు లో వారి కథ భం భం భయం చదివాను.అదే స్టైల్ అదే చరిష్మా.
డిఫరెంట్ సబ్జెక్టు .కుబేరుడు ప్రజలకు అప్పు ఇవ్వడం అనే కాన్సెప్ట్ చాలా బావుంది.హీరో అనాథల కోసం దర్శనం క్యూలో నిలబడి ఆ ప్రసాదాన్ని అనాథలకు తీసుకొచ్చి ఇవ్వడం..తనని నమ్మని హీరోకు కుబేరుడిని అప్పు ఇవ్వమని చెప్పడం థానే సాక్షిగా ఉండడం,మనవాళ్ళు ఇలాంటి సబ్జెక్టుతో సినిమాలో తీసేరోజు అవాలని ఆ శ్రీనివాసుడ్ని ప్రార్థిద్దాం .థాంక్యూ కినిగె..
కొత్త ఆలోచనను మాత్రమే కాదు ఆహ్లాదాన్ని అందించిన నవల.ఎందుకంటే కుబేరుడి దిగివచ్చి అప్పు ఇస్తే శ్రీనివాసుడు సాక్షిగా ఉంటే.కుబేడు ఎలా అప్పు వసూల్ చేసుకుంటాడు..వడ్డీలేని అప్పు ఎలా ఇచ్చాడు ? అన్న పాయింట్ కొత్తగా వుంది.నవ్వుకుంటూ ఆలోచించేలా చేసిన నవల.సినిమా చూస్తున్నట్టు వుంది.మూస సినిమాలు వదిలి ఇలాంటి సబ్జక్ట్స్ తో సినిమాలు తీస్తే తెలుగులో విభిన్నమైన సినిమాలు వస్తాయి.
beautiful pleasant entertainer ...with fantastic message
అల్లరి నరేష్ వైభవ్ పాత్రకు సరిగ్గా టైలర్ మేడ్ పాత్రలా సరిపోతాడు.దేశ ఆర్థిక పరిస్థితికి,నిరుద్యోగుల ఆర్థిక సమస్యలకు ,ఉపాథికల్పనకు భేషైన కాన్సెప్ట్.
ఆధ్యంతం ఆసక్తికరం..కుబేరుడు బ్యాంకు లా మారి అప్పు ఇవ్వడం మంచి కాన్సెప్ట్.కాల్ నాగుల బారినుంచి తప్పించుకోవచ్చు .పైసావసూల్ టైటిల్ కు నూటికి నూరుశాతం న్యాయం చేయడమే కాదు వందనవ్వుల విందు ఈ నవల.విజయార్కె గారి నవ్వుదేవోడొచ్చాడోచ్ తరుబాథ నవ్వుతూ హాయిగా చదువుకున్న నవల,
పైసావసూల్ నవల కొత్త కాన్సెప్ట్ .కొత్తదనంతో కూడిన కథాంశంతో కుబేరుడే అప్పులిస్తే,తిరిగి వడ్డీ ప్లస్ అసలు ఎలా వసూలు చేసుకోవాలో హీరో చెప్పడం ,సాక్షాత్తు ఏడుకొండలవాడే సాక్షిగా ఉండడం ..సూపర్ సబ్జెక్టు,
కామెడీతో పాటు సీరియస్ గా అలోచించి ఆహ్లాదంగా నవ్వుకునే నవల,
ఎప్పుడూ పగలు ప్రతీకారాలు ఒకే సబ్జెక్టు ను తిప్పితిప్పి చెప్పడంకన్నా రచయితలు ఇలాంటి కొత్త సబ్జక్ట్స్ అటెంప్ట్ చేయాలి.
అల్లరి నరేష్ లాంటి హీరోలకు సరిగ్గా సరిపోయే ఎంటర్టైనర్ పైసావసూల్.
Different wishful concept.
But there are too many spelling mistakes which is irritating.
No proof reader it seems.
Also the story is too short.
ఇలాంటి విభిన్నమైన కథలు అరుదుగా వస్తుంటాయి.కుబేరుడు అప్పు ఇవ్వడం..ఏడుకొండలవాడు సాక్షిగా ఉండడం ఆ డబ్బును ఎలా వసూలు చేసుకోవాలో చెప్పడం.
వడ్డీ ఇవ్వని వైభవ్ ను కారుతో సహా పైకి తీసుకువెళ్లిన కుబేరుడి తెలివితేటలూ , ,అనాథశరణాలయం.దేవుడిని నమ్మని హీరో, అద్భుతమైన కథాకథనం .ఆహ్లాదకరమైన సందేశాత్మక హాస్యనవల.పాతికేళ్ల క్రితం ( ఆంధ్రభూమిలో ) నేను చదివిన కుబెరయ నవలకు సీక్వెల్ కాబోలు.
దేవుడిని నమ్మని వైభవ్ " ఆ దేవుడి ప్రసాదాన్ని పిల్లల కోసం పట్టుకెళ్తాడు ".దేవుడా నువ్వున్నావు..నువ్వున్నావన్న నమ్మకమే అనాథలకు అన్నం పెడుతుంది " అంటాడు.
తనను నమ్మని భక్తుడికి తానే దగ్గరుండి ష్యురీటీ ఇచ్చి మరీ కుబేరుడితో అప్పు ఇప్పిస్తాడు ఏడుకొండలవాడు.
అసలు ఇవ్వక వడ్డీ కట్టక ,జాగ్వార్ కారులో వెళ్తున్న వైభవ్ ను ఫ్లై ఓవర్ నుంచి సరాసరి తన లోకానికి తీసుకువస్తాడు కుబేరుడు.
ఇచ్చిన డబ్బు వడ్డీ ఎలా వసూలు చేసుకున్నాడో కుబేరుడు...?
సునిశిత హాస్యం..సుతిమెత్తని ఆర్థ్రత్త ఆహ్లాదానికి అక్షరాల మజిలీ " పైసావసూల్ "
సందేశాన్ని సరదా సరదా కథనంతో చదివించే నవల .
ఒక మంచి రచన చదువుతున్నప్పుడు మనసుకు హాయిగా ఉంటుంది
పైసా వసూల్ అలాంటి నవల,
ముఖ్యంగా కథావస్తువు.విభిన్నమైన కథాంశం..మంచి రచనాశైలి.భావుకత్వం హాస్యం సామాజికస్పృహ ఆలోచనాత్మక సంభాషణలు.
దేవుడిని నమ్మని కథానాయకుడు ( హీరో) తిరుపతిలో స్వామివారి దర్శనం కోసం కంపార్ట్మెంట్ లో నిలబడి అక్కడ స్వమివారి దర్శనానికి వేచివున్న భక్తులకు దేవస్థానం అందించే ఉప్మా అనాథపిల్లల కోసం తీసుకువెళ్తూ " ఇంతమంది అనాథలా ఆకలి తీర్చిన నువ్వు దేవుడివే" అనడం అర్థవంతం గా వుంది
తనని నమ్మని భక్తుడికి ...
స్వయానా శ్రీవేంకటేశ్వరుడే పూచీదారుడిగా హీరో వైభవ్ కు అప్పు ఇప్పించడం, వడ్డీ ఎలా వసూల్ చేసుకోవాలో హీరో చెప్పడం...
ఇవ్వన్నీ చదివితేనే బావుంటుంది,
కుబేర టీవీ ఛానెల్స్ బ్యాంక్స్ రెస్టారెంట్స్ ,,,,ఆలోచన బావుంది.
ఒక ఆరోగ్యకరమైన హాస్యచిత్రాన్ని చూసినట్టు వుంది.
మన దర్శక నిర్మాతగాలు హీరోలు ఇలాంటి చక్కని హాస్య చిత్రాలు చేస్తే బావుంటుంది.
పైసావసూల్ నవలలో రాసినట్టును జరిగితే కుబేరుడు కనికరిస్తే దేశమంతా సిరిసంపదలే . నవ్విస్తూ ఆలోచించేలా చేసిన ఈ నవల చదువరుల్లో అలా నిలిచిపోతుంది.వైభవ్ కారులో అలా బేగం పేట్ ఎయిర్ పోర్ట్ నుంచి గాల్లోకి లేచి టేకాఫ్ తీసుకుని కుబేరుడి లోకానికి వెళ్లే సన్నివేశం థ్రిల్లింగ్ గా వుంది.
కారు సరాసరి కుబేరుడి లోకంలో ల్యాండ్ అయ్యింది సేఫ్ గా.
కుబేరుడు చిద్విలాసంగా చూసి "వాట్ అబౌట్ మై వడ్డీ అండ్ అసలు" అని నిలదీసాడు.
* *వెంటనె కృత్తిక "మీ టూ" అంది తనను కూడా ఆశీర్వదించమన్నట్టు కిందికి వంగి
"మీ టూ"అంటే కుబేరుడు అపార్థం చేసుకుని భయపడిపోతారు అన్నాడు లోగొంతుకతో కృత్తికతో
* "మీలోకం కరెన్సీ కాదు..మా ఇండియా కరెన్సీ ...అదీ రద్దైన నోట్లు కాదు.. మోదీ గవర్నమెంట్ కొత్తగా అచ్చుగుద్దిన నోట్లు" చెప్పాడు వైభవ్
* "ఇలా అడుగుతున్నందుకు క్షమించాలి. మీకు బిపి షుగర్ గట్రా ఉన్నాయా? అడిగాడు వైభవ్
" అనగా ..?” అడిగాడు కుబేరుడు
"మా లోకమునందు వుండు మాయరోగములు...జన్యుపరంగా, స్ట్రెస్ పరంగా వచ్చును" అన్నాడు వైభవ్
"మాకు శాపములు తప్ప రోగములు వుండవు.." చెప్పాడు కుబేరుడు
ఇలాంటి డైలాగ్స్ నవ్విస్తూ ఆలోచించేలా చేస్తాయి.
సూపర్బ్ నవల.ఇలాంటి ఆరోగ్యకరమైన కామెడీ సినిమాలు రావాలి
తను నమ్మని దేవుడు తనని నమ్ముకున్న అనాథలకు అన్నం పెడుతున్నాడని,ఆ దేవుడినే నమ్మడం,సాక్షాత్తు
ఆ దేవదేవుడే కుబేరుడి ద్వారా అప్పు ఇప్పించడం,ఆ అప్పును వైభవ్ తీర్చే విధానం,కృత్తిక క్యారెక్టర్ ,హాస్యం ఆలోచన ఆహ్లాదం..
వైభవ్ కారుతో సహా ఫ్లై ఓవర్ నుంచి కుబేరుడి లోకానికి వెళ్లడం గమ్మత్తైన అనుభూతి...
కొసమెరుపుగా నిజ్జంగా ఇలా జరిగితే ఎంత బావుంటుందన్న ఆలోచన..వెరసి పైసా వసూల్...పాఠకుల మనసులను వసూలు చేసి రచయితకు ఇచ్చేసింది.
నరుక్కునే సినిమాలు రోయిన్ సినిమాలు తీసే దర్శ నిర్మాతలు హీరోలు ఇలాంటి కథలను సినిమాలుగా తీస్తే వసూళ్ల వర్షమే.