-
-
కొంగుచాటు ప్రేమ
Konguchatu Prema
Author: Tejarani Tirunagari
Publisher: Manrobo Publications
Pages: 50Language: Telugu
"మెల్లిగా భయంభయంగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. అంతకన్నా భయంగా బామ్మ బెడ్రూమ్లోకి తొంగి చూసాడు. బామ్మ మంచం మధ్యలో పద్మాసనం వేసుకుని బుద్ధిగా చదువుకుంటోంది.
అదేదో రామాయణమో భారతమో అనుకుంటే అనుకుంటే పేస్‌బుక్‌లో తల దూర్చినట్టే....
ఆత్మహత్య చేసుకోవడం ఎలా? అన్న పుస్తకం అది.
రచయితలకు టాపిక్కులు దొరకనట్టు ఈ పుస్తకం రాసారేమిట్రా బాబూ ..? అని స్వగతంగా తనలో తానే గొణుక్కుంటున్న అతగాడే
ఈ కథకు కథానాయకుడు...గోపాలం నామధేయుడు...
ఒంటి పేరు గోపాల్ అయితే ఇంటి పేరు..కొంగు..
పూర్తి పేరు కొంగు గోపాల్.
కొందరు గోపాల్ అంటారు.. మరికొందరు గోపి అంటారు..
బామ్మ మాత్రం "గోపు..ఒరే గోపుడూ"అని పిలుస్తుంది.
తల్లీ తండ్రీ గోడ మీద ఫ్రేమ్స్ లో ఫ్రీజ్ అయ్యారు. అల్లారుముద్దుగా ఐస్ క్రీమ్స్ తినిపించి మరీ పెంచింది మనవడిని.
అలాంటి బామ్మ అర్జెంటుగా బాల్చీ తన్నేసి గోడమీదికి ఎక్కాలని ఫిక్స్ అయిపొయింది.
దానిక్కారణం..
గోపాల్ భయానికి రీజన్...
ఈ కథకు ముహూర్తం షాట్ తెలుసుకోవాలంటే కథతో పాటు మనం ముందుకు వెళ్లాల్సిందే."
వండర్ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి
రొమాంటిక్ థ్రిల్లర్
కొంగుచాటు ప్రేమ
మేన్ రోబో పబ్లికేషన్స్ ప్రచురణ
చాలాకాలం తరువాత ఆహ్లాదంగా చదువుకునే నవల కనిపించింది.పేస్ బుక్ నేపథ్యంలో కొత్తజ్ఞాపకాలను ప్రోది చేసుకునే సన్నివేశాలతో మనసును హత్తుకునేలా రాసారు రచయిత్రి.ముఖ్యంగా బామ్మ పాత్రలు హైలెట్.
" కడుపుబ్బా నవ్వుకున్నాం " అనే మాటలకు అర్థం తెలిసింది.చదువుతున్నంతసేపూ నవ్వుకుంటూనే వున్నాం.కొత్త కాన్సెప్ట్ ...ముఖ్యంగా బామ్మ ఇంట్లో బార్ ఓపెన్ చేసిన తీరు...అదరహో ...మైండ్ గేమ్ లో ఫన్నీ మూమెంట్స్...చికాగ్గా వున్నప్పుడు ఈ నవల చదివితే చికాకులు బాధలు హాంఫట్ ..జంధ్యాల గారి సినిమా చూస్తున్నట్టు వుంది,
మేన్ రోబో పబ్లికేషన్స్ నవలలు విభిన్నంగా ఉంటాయి.వైవిధ్యమైన సబ్జక్ట్స్...కొంగుచాటు ప్రేమ లో ఆ ఫ్రెష్ నెస్ కనిపిస్తోంది.పేస్ బుక్ స్వయంవరం..కొంగు గోపాల్ ప్రేమాయణం..ప్రేమ ఆరిందాతనం...బామ్మల అల్లరి వావ్....జంధ్యాల గారి సినిమా చూస్తున్నంత ఆహ్లాదంగా వుంది.ఇలకంటి మంచి నవలలు అందిస్తున్న కినిగెకు,మంచి ఫీల్ వున్న నవల రాసిన రచయిత్రి తేజారాణి తిరునగరికి ,మేన్ రోబో పబ్లికేషన్స్ కు థాంక్స్
సరదాగా చదివిస్తూ సీరియస్ గా ఆలోచింపజేస్తూ కొత్తదనంతో థ్రిల్లింగ్ ని కలిగించిన నవల కొంగుచాటు ప్రేమ...ఇలాంటి రచనలు అరుదుగా వస్తాయి.
I rented this book after seeing the ratings and reading the reviews. But I am totally disappointed after I started reading the book. The concept is fine but the language is exactly how the youth talk in present times. That language is okay to talk but not to read. Frankly, it’s very irritating to read.
కొత్తరకమైన ప్రేమకథ.ఆహ్లాదంగా వుంది.రణగొణధ్వనులకు దూరంగా స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉండాలో రాసారు.నేను క్యాన్సర్ ని జయించండి చదివాను.మీ స్వీయ అనుభవాన్ని ధైర్యంగా ఇతరులకు చెప్పిన విధానం చాలా బావుంది.మీ రచనలు ఎందరికో ధైర్యాన్ని కలిగిస్తాయి.ఆ స్వరస్వతీదేవి కృప మీ మీద వుంది.