-
-
కత్తుల బోను
Kattula Bonu
Author: Adapa Chiranjeevi
Publisher: Sri Krishnadevaraya Publications
Pages: 52Language: Telugu
“నీవన్నది నిజం... మా యువరాణి ముందు దేవకాంతలు కూడ తమ అందాన్ని పరీక్షించుకుని ముఖాలు చిన్నబుచ్చుకుంటారు. మా అందాల బరిణెను చూస్తే మన్మథుడు, నలకూబరుడులాంటి దివ్య పురుషులు వారి లోకాన్ని విడిచి వస్తారు..." అంటూ రాజకుమారి గురించి గొప్పగా వర్ణించి చెప్పాడు తిమ్మయ్య “అలాంటప్పుడు మాలాంటి వీరులకు పోటీ పెట్టి, భవంతిలోకి వెళ్ళగలిగిన వారికి యువరాణినిచ్చి పెళ్ళి చేయవచ్చు కదా!” అని అతని ముఖంలోకి చూశాడు.
“పోటీ పెట్టి పెళ్ళి చేయడానికి ఇది స్వయంవర ప్రకటనకాదు!
యువరాణి రక్షణార్థం ఏర్పాటు చేసిన మందిరం... ఇంతకీ తమరెవరు వీరకిశోరా?" అని ప్రశ్నించాడు కాస్త వ్యంగ్యంగా.
"మీ పొరుగునున్న నికుంభ రాజ్యం మాది. యువరాజు సూర్యవర్మని. మీ రాజ్యంలో పరిస్థితుల గురించి మా వేగులు చెప్పగా విని, ఈ వింత ఏమిటో చూద్దామని వచ్చాను..."
ఆ రాజ్యంలో ఆ పరిస్థితులేమిటి?
ఆ వింత ఏమిటి?
పాఠకులను వాయుమనోవేగాలతో పరుగులు తీయించే
మణిదీపుడి సాహసయాత్ర
కత్తుల బోను
అడపా చిరంజీవి జానపద నవల!
పిల్లలు బాగా ఇష్టంగా చదివే పత్రిక చందమామ. ఆ మామ లేని లోటుని అడపా చిరంజీవి భర్తీ చేస్తున్నారు. చిరంజీవి జానపద నవలలు చదువుతుంటే చందమామ గుర్తుకు వస్తుంది.అంత బాగా పిల్లలను ఆకట్టుకునేలా సులభశైలిలో జానపద నవలలను అందిస్తోన్న చిరంజీవి ఒక విధంగా పిల్లలందరికీ మేనమామే ...! చందమామ లేకపోయినా ఈ మేనమామ మన పిల్లలకు వున్నాడు.కత్తులబోను నవల చదివిన తరువాత కామెంట్ ఏం రాద్దామా..అనుకుంటే , ఇదే సరైన కామెంట్ అనిపించింది. కొత్తదనం చూపించడంలో చిరంజీవిది అందెవేసిన చేయి. ఈ నవల చాలా చాలా బావుంది. నవల్లో కథానాయకుడు మణిదీపుడి సాహసాలు ఉత్కంఠ కలిగించేలా వున్నాయి. తిమ్మయ్య పాత్ర అద్భుతంగా వుంది. వెరసి నవల మొత్తం చివరివరకూ పట్టు వదలకుండా చదివించింది. జానపద నవలలు రాసేవాళ్ళు ఒకప్పుడు కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు అయితే , ఇప్పుడు ఈ తరంలో మధుబాబు, అడపా చిరంజీవి తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు.